తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung నుంచి A-సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Samsung నుంచి A-సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

HT Telugu Desk HT Telugu

27 March 2022, 13:11 IST

    • Samsung తాజాగా Galaxy A13, A23 అనే స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. కొద్ది పాటి మార్పులు మినహా ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. రూ. 14,999 నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి
Samsun Galaxy A13 & A23 Smartphones
Samsun Galaxy A13 & A23 Smartphones (Samsung)

Samsun Galaxy A13 & A23 Smartphones

Samsung ఇటీవల ఆవిష్కరించిన Galaxy A13, A23 లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. డిజైన్ పరంగా ఒకే విధంగా ఉన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మధ్య-శ్రేణి ధరల విభాగంలో రూ. 20 వేల బడ్జెట్లో ఉన్నాయి. A13, A23 రెండూ కూడా 5,000mAh బ్యాటరీలు మరియు 50MP ప్రైమరీ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

ర్యామ్ స్టోరేజ్ ఆధారంగా A13 మోడెల్ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, A23 మోడెల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మరి ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏమున్నాయి? వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇక్కడ చూడండి.

Samsung A13 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే

ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 4GB/64GB, 4GB/128 GB అలాగే 6GB/128GB

ఎగ్జినోస్ 850 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 14,999/- నుంచి ప్రారంభం

4GB/64GB వేరియంట్ ధర రూ. 14,999/-

 4GB/128GB వేరియంట్ ధర రూ. 15,999/-

6GB/128GB వేరియంట్ ధర రూ. 17,499/-

Samsung A23 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే

ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 6GB/128GB & 8GB/128GB

స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 4K వీడియో, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 19,499/- నుంచి ప్రారంభం

6GB/128GB వేరియంట్ ధర రూ. 19,499/-

8GB/128GB వేరియంట్ ధర రూ. 20,999/-

ఈ స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, వైట్, లైట్ బ్లూ, ఆరెంజ్ కలర్ ఛాయిస్ లలో లభిస్తున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు ఫోన్లు 5G సపోర్ట్ చేయవు.

తదుపరి వ్యాసం