Makeup Tips : ఈ ట్రిక్స్‌తో మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది.. అస్సలు పోదు.. ట్రై చేయండి!
29 May 2024, 17:00 IST
- Beauty Tips In Telugu : చాలా మంది మేకప్ వేసిన కాసేపటికే పోతూ కనిపిస్తుంది. కానీ ఇలా అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ మేకప్ ఎక్కువసేపు ఉంటుంది.
మేకప్ వేసేందుకు చిట్కాలు
మేకప్‌కు ముందు మీ చర్మాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి. లేకుంటే అనేక సమస్యలను తెస్తుంది. వీటిలో చర్మ సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి. మొటిమలు, వడదెబ్బ, ముఖం జిగట చాలా సాధారణ సమస్యలలో ఒకటి. ఈ సమస్యల్లో ఒకటి మేకప్‌కి సంబంధించినది. వేసవిలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీని కారణంగా ముఖంపై మేకప్ ఉండదు. వేసిన కాసేపటికి ఊడిపోతుంది. అందుకే మీరు సరైన చిట్కాలు పాటించాలి. అప్పుడే మీ మేకప్ సరిగా ఉంటుంది. లేదంటే మళ్లీ మెుదటికి వస్తుంది.
ఎక్కడికైనా వెళ్లి రెడీ అవ్వాలంటే చాలా కష్టమైన పని. ఇంటి దగ్గరే మేకప్ వేసుకుని వెళ్లాలి. కానీ వెళ్లిన కాసేపటికే మేకప్ పోతే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా వేసవిలో మేకప్ చేయడం చాలా కష్టమైన పని. వేసవిలో మీ చర్మం కూడా జిడ్డుగా మారితే, మేకప్ వేసుకునే ముందు మీకు కొన్ని సులభమైన పద్ధతులను పాటించాలి. తద్వారా మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. మేకప్‌లో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
ఫేస్ వాష్ చేయండి
మేకప్ వేసుకునే ముందు తేలికపాటి ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది మీ ముఖం నుండి జిగట, అదనపు నూనెను తొలగిస్తుంది. మీరు ముఖం కడుక్కోకుండా మేకప్ వస్తే.. ఆల్ రెడీ మీ ముఖంపై ఉన్న జిడ్డు.. తర్వాత మేకప్ పోయేలా చేస్తుంది. అందుకే శుభ్రంగా ఫేస్ వాష్ చేస్తే ఇలాంటి సమస్యలు ఏమీ రావు.
టోనింగ్ అప్
ముఖం కడుక్కుంటే మాత్రమే సరిపోదు. ముఖాన్ని డీప్ క్లీన్ చేసుకోవడం కూడా అవసరం. ఇందుకోసం టోనర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనికి రోజ్ వాటర్ ఉత్తమం. రోజు వాటర్ ఉపయోగిస్తే మీ ముఖం కాసేపటికి గ్లో వస్తుంది. అంతేకాదు.. చర్మం కాస్త పొడిగా మారుతుంది. అయితే రోజ్ వాటర్ పెట్టిన తర్వాత కాసేపు ఫ్యాన్ కింద నిలబడండి.
ఐస్ మసాజ్
మేకప్ ఎక్కువసేపు ఉండాలి అంటే.. ఐస్‌తో మసాజ్ చేయడం ముఖ్యం. 2 ఐస్ క్యూబ్స్ తీసుకుని మీ ముఖాన్ని బాగా మసాజ్ చేయండి. ముఖం అంతటా రుద్దాలి. అప్పుడే మీ చర్మ కణాలు బాగా అవుతాయి. తర్వాత మీరు మేకప్ చేసినా కూడా ఊడిపోదు.
మాయిశ్చరైజర్
దీని తర్వాత ముఖం మీద పూర్తిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. జిడ్డు చర్మం కోసం లిక్విడ్ మాయిశ్చరైజర్‌ని ఎంచుకోండి. వీటిలో జిడ్డు ఉండదు. ఇవి చర్మంలో బాగా కలిసిపోతాయి. ఇది కాకుండా మీ ముఖాన్ని సరిగ్గా మసాజ్ చేయండి. దీంతో ముఖంలో రక్త ప్రసరణ పెరిగి చర్మం రిలాక్స్‌గా ఉంటుంది. ఈ అన్ని ట్రిక్స్ పాటిస్తే.. మేకప్ వేసుకున్న తర్వాత మీ ముఖం జిడ్డుగా అనిపించదు. మేకప్ కూడా చాలా సమంయ ఉంటుంది.
మేకప్ వేసుకుని రాత్రి వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా తీసేసి మాత్రమే నిద్రపోవాలి. లేదంటే మీ చర్మం అనారోగ్యం పాలవుతుంది. కచ్చితంగా మేకప్ తీసిన తర్వాత బెడ్ మీదకు వెళ్లండి. మెుటిమలు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.