రెండో పెళ్లి చేసుకున్న కమెడియన్, బిగ్ బాస్ విన్నర్.. మేకప్ ఆర్టిస్ట్‌తో సీక్రెట్‌గా అఫైర్-comedian bigg boss 17 winner munawar faruqui married for second time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రెండో పెళ్లి చేసుకున్న కమెడియన్, బిగ్ బాస్ విన్నర్.. మేకప్ ఆర్టిస్ట్‌తో సీక్రెట్‌గా అఫైర్

రెండో పెళ్లి చేసుకున్న కమెడియన్, బిగ్ బాస్ విన్నర్.. మేకప్ ఆర్టిస్ట్‌తో సీక్రెట్‌గా అఫైర్

Hari Prasad S HT Telugu
May 27, 2024 03:40 PM IST

ప్రముఖ కమెడియన్, బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాదాస్పద స్టాండప్ కమెడియన్ ఓ మేకప్ ఆర్టిస్టును పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండో పెళ్లి చేసుకున్న కమెడియన్, బిగ్ బాస్ విన్నర్.. మేకప్ ఆర్టిస్ట్‌తో సీక్రెట్‌గా అఫైర్
రెండో పెళ్లి చేసుకున్న కమెడియన్, బిగ్ బాస్ విన్నర్.. మేకప్ ఆర్టిస్ట్‌తో సీక్రెట్‌గా అఫైర్

బిగ్ బాస్ 17 విజేత అయిన మునావర్ ఫరూఖీ సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు వారాల కిందట అతడు మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజబీన్ కోట్వాలాను పెళ్లి చేసుకున్నట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది. తన రెండో పెళ్లి గురించి ఎవరికీ తెలియకూడదని అతడు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయని కూడా ఈ సందర్భంగా ఈ రిపోర్టు తెలిపింది.

మునావర్ రెండో పెళ్లి

కమెడియన్, బిగ్ బాస్ 17 విజేత అయిన మునావర్ రెండో పెళ్లిని అతని సన్నిహిత వర్గాలు ధృవీకరించినట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది. "అవును.. మునావర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయం అతడు సీక్రెట్ గా ఉంచాలని అనుకున్నాడు. అందుకే మీకు ఈ పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు దొరకవు" అని మునావర్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది.

ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా హోటల్లో వీళ్ల పెళ్లి రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఆదివారం (మే 26) ఈ ఈవెంట్ జరిగింది. అయితే పెళ్లి మాత్రం రెండు వారాల కిందటే జరిగినట్లు సమాచారం. ఓ సోషల్ మీడియా పేజ్ మునావర్ రిసెప్షన్ జరిగిన హోటల్లోని వెల్కమ్ నోట్ ను షేర్ చేసింది. అందులో కేవలం ఎం అండ్ ఎం అనే అక్షరాలు మాత్రమే ఉన్నాయి.

ఎం అంటే మునావర్. రెండో ఎం అంటే మెహజబీన్ అని అర్థం. ఈ ఇద్దరూ రెండు వారాల కిందట పెళ్లి చేసుకొని ఇప్పుడు కూడా కేవలం సన్నిహితులకు మాత్రమే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెహజబీన్ ఓ మేకప్ ఆర్టిస్ట్ కావడం విశేషం. ఈ పెళ్లికి నటి, మునావర్ స్నేహితురాలు హీనా ఖాన్ కూడా హాజరైనట్లు సమాచారం. ఆమె కూడా రిసెప్షన్ జరిగిన ప్రదేశానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్ లో మేరే యార్ కీ షాదీ హై సాంగ్ ప్లే చేసింది.

మునావర్ మొదటి భార్య ఎవరు?

తన మొదటి పెళ్లి గురించి బిగ్ బాస్ 17లోనే మునావర్ వెల్లడించాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం అని, వాళ్లకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. అది వర్కౌట్ కాలేదని అతడు చెప్పాడు. ఆమె గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, కానీ తమ మధ్య పెళ్లి బంధం మాత్రం నిలవలేదని స్పష్టం చేశాడు. ఇక 2022లో కంగనా హోస్ట్ చేసిన లాకప్ షోలోనూ మునావర్ దీని గురించి చెప్పాడు.

అతడు ఓ అమ్మాయి, చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను చూపిస్తూ వాళ్లెవరు అని ప్రశ్నించింది. దీనికి మునావర్ స్పందిస్తూ.. "నేను దీని గురించి మాట్లాడదలచుకోలేదు. సోషల్ మీడియాలో, లాకప్ లాంటి ప్లాట్‌ఫామ్ పై అస్సలు మాట్లాడను. నేనేమీ దాచడం లేదు కానీ దీని గురించి మాట్లాడను. ఏడాదిన్నరగా వేరుగా ఉంటున్నాం. కోర్టు పనులు నడుస్తున్నాయి. అందుకే దీనిపై మాట్లాడను" అని మునావర్ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024