Kangana Ranaut : కంగనా రనౌత్ బీఫ్ తింటారా? ఆమె సమాధానం ఇది..
Kangana Ranaut Beef : తాను బీఫ్ తింటానని వస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పిందించారు కంగనా రనౌత్. హిందుత్వం, జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేశారు.

Kangana Ranaut Lok Sabha elections : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినప్పటి నుంచి.. ప్రముఖ నటి కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె బీఫ్ తింటారని.. విపక్ష పార్టీ నేతల్లో కొందరు ఆరోపించారు. తాజాగా.. ఆ ఆరోపణలను కొట్టిపారేశారు కంగనా రనౌత్. ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
కంగనా రనౌత్ బీఫ్ తింటారా?
కంగనా రనౌత్ బీఫ్ తింటారని.. ఏప్రిల్ 5న ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్ నేక విజయ్ వాడెట్టివర్.
"నటి కంగనా రనౌత్‌కి బీఫ్ ఇష్టమని, తింటానని ఆమె ఒకసారి చెప్పారు. ఆమెకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అవనీతిపరులైన నేతలకు బీజేపీ స్వాగతం పలుకుతోంది," అని విజయ్ చెప్పుకొచ్చారు.
విజయ్ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కంగనా రనౌత్.
2024 Lok Sabha elections : "యోగిక్, ఆయుర్వేద జీవితాన్ని అనుసరించాలని నేను అందరికి చెబుతున్నాను. నా పరువును దెబ్బతీసేందుకు ఇలాంటి ప్లాన్స్ పనిచేయవు. నా గురించి నా ప్రజలకు బాగా తెలుసు. హిందువుగా ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు బీఫ్ తినలేదు. ఎలాంటి రెడ్ మీట్‌ని ముట్టుకోలేదు. నా గురించి తెలిసిన వారిని ఎప్పుడు తప్పుదోవ పట్టించలేరు. జై శ్రీరామ్," అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కంగనా రనౌత్. ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ మాటలు సిగ్గు చేటు అని అభిప్రాయపడ్డారు.
విజయ్ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర బీజేపీ ప్రతినిథి కేశవ్ ఉపాధ్యాయ సైతం స్పందించారు.
"ఇది కాంగ్రెస్ నీచ రాజకీయాలు, నీచ ఆచారాలకు ప్రతిబింబం. ఇది పార్టీ మనస్తత్వానికి ప్రతీక," అని కేశవ్ చెప్పుకొచ్చారు.
Kangana Ranaut latest news : ఇక 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. జూన్ 1న ఇక్కడ ఎన్నికలు జరగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక కంగనా రనౌత్‌కు పోటీగా.. లోక్‌సభ ఎన్నికల్లో.. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత పబ్లిక్ వర్క్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి వికమాదిత్య సింగ్‌ని బరిలో దింపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోందని వార్తలు వస్తున్నాయి. మండీ నియోజకవర్గానికి.. ఆయన తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.
సంబంధిత కథనం