తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sharbat | ఈ స్పెషల్ ఫ్లేవర్ షర్బత్ మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది!

Sharbat | ఈ స్పెషల్ ఫ్లేవర్ షర్బత్ మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది!

HT Telugu Desk HT Telugu

27 April 2022, 16:53 IST

google News
    • మార్కెట్లో దొరికే కార్బోనేటెడ్ బెవరేజెస్ తాగితే బరువు పెరుగుతారు. ఇంట్లోనే ఇలా షర్బత్ చేసుకొని తాగితే చల్లదనంతో పాటు బరువును నియంత్రించుకోవచ్చు..  ఈ స్పెషల్ ఫ్లేవర్ షర్బత్ తో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకోండి
Refreshing Sharbat
Refreshing Sharbat (Unsplash)

Refreshing Sharbat

షర్బత్ అనేది ఇరానీ డ్రింక్ అని చెప్తారు అయినప్పటికీ మన భారత సంప్రదాయంలోనూ చాలా ఏళ్ల నుంచి ఈ పానీయం ఉంది. ఇప్పుడంటే కోలాపెప్సీ అంటూ స్టోర్ నుంచి రెడీమేడ్ డ్రింక్స్ కొనుక్కొని ఇన్‌స్టంట్‌గా తాగేస్తున్నారు గానీ, ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తే షర్బత్ చేసి ఇచ్చేవారు. ముఖ్యంగా నిమ్మకాయ షర్బత్ అప్పట్లో చాలా పాపులర్.

ప్రస్తుతం మనకు ఎండాకాలం నడుస్తుంది. ఈ సీజన్‌లో ప్రజలు చల్లదనం కోసం రకరకాల షేక్స్, జ్యూస్ లు అంటూ తాగుతున్నారు. మరి అవన్నీ కాకుండా ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో స్వచ్ఛమైన షర్బత్ చేసుకుంటే చల్లదనం లభిస్తుంది, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.

మీరు ఎప్పుడైనా ఇలైచీ షర్బత్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే మీకు ఇంట్లోనే సులభంగా చేసుకునే విధంగా ఇలైచీ షర్భత్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాము.

కావలసినవి

యాలకుల పొడి - 1 tsp

నిమ్మరసం - 2 tsp

నల్ల ఉప్పు - 1/2 tsp

నిమ్మకాయ ముక్కలు - 2

చక్కెర - రుచికి తగినంత

ఐస్ క్యూబ్స్ - 8-10

చల్లని నీరు - 4 కప్పులు

తయారీ విధానం

  • ముందుగా ఒక కూజా తీసుకొని అందులో నాలుగు కప్పుల చల్లటి నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా చక్కెర వేయండి, మరి ఎక్కువ తియ్యగా కాకుండా.. లైట్ గా తియ్యదనం ఉండేలా చూసుకోండి. చక్కెర పూర్తిగా కరిగే వరకు చెంచాతో బాగా కలపండి.
  • ఇప్పుడు ఈ చక్కెర నీటిలో నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, యాలకుల పొడిని కలపండి. ఇవి కూడా బాగా కరిగేవరకు కలపండి.
  • ఇప్పుడు ఈ ద్రావణంలో ఐస్ క్యూబ్స్ వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కనపెట్టండి.
  • అంతే ఇలైచీ షర్బత్ దాదాపు రెడీ అయినట్లే. ఇప్పుడు సర్వింగ్ గ్లాసులోకి షర్బత్ పోసుకొని, పైనుంచి మరో 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే నిమ్మకాయ ముక్కలతో అలంకరించుకోండి.

ఈ షర్బత్ లోని పోషక గుణాలు శరీరంలోని హానికర బాక్టీరియాలను నాశనం చేస్తాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మానికి ఇంకా కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతుంది. బరువు నియంత్రణకు సహాయకారిగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం