తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rooh Afza Lemonade | ఒంట్లోని వేడినే కాదు.. మీ మనస్సును శాంతపరిచే పానీయం!

Rooh Afza Lemonade | ఒంట్లోని వేడినే కాదు.. మీ మనస్సును శాంతపరిచే పానీయం!

HT Telugu Desk HT Telugu

12 April 2022, 18:44 IST

google News
    • అసలే ఎండాకాలం.. ఆపై రంజాన్ మాసం. ఎండవేడిని చల్లార్చుకోడానికి, ఇఫ్తార్ విందును ముగించటానికి, అద్భుతమైన ఆరోగ్యకరమైన రూహ్ ఆఫ్జా పానీయం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.
Prepare Homemade Rooh Afza Lemonade
Prepare Homemade Rooh Afza Lemonade (Pixabay)

Prepare Homemade Rooh Afza Lemonade

ఒకవైపు ఎండాకాలం మరోవైపు పవిత్ర రంజాన్ మాసం. ఈ ప్రత్యేకమైన మాసంలో ముస్లింలు ప్రతిరోజూ ఉదయం నుంచి ఉపవాసం, ప్రార్థనలతో కఠినంగా దీక్ష చేస్తారు. మళ్లీ సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్ వేళల్లో సాంప్రదాయం ప్రకారం ఖర్జూరం పండ్లు తిని, నీరు త్రాగుతారు. ఆ తర్వాత పసందైన వంటల విందు ఉంటుంది.

ఈ వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరిచే ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం రూహ్ ఆఫ్జా సేవించడం అద్భుతంగా ఉంటుంది. రూహ్ ఆఫ్జా అంటే మనస్సును శాంతపరిచేది అనే అర్థం వస్తుంది. చెఫ్ కునాల్ కపూర్ ఇంట్లోనే రూహ్ ఆఫ్జా డ్రింక్ ఎలా చేసుకోవాలో తన రెసిపీని పంచుకున్నారు.

రూహ్ అఫ్జా కూలర్ తయారీకి కావలసినవి:

  • రూహ్ అఫ్జా (రోజ్ సిరప్) - 4-5 టేబుల్ స్పూన్లు
  • నిమ్మకాయలు - 2
  • ఉప్పు - చిటికెడు
  • నల్ల ఉప్పు - చిటికెడు
  • మిరియాల పొడి - చిటికెడు
  • పుదీనా ఆకులు - కొన్ని
  • ఐస్ క్యూబ్స్ - కొన్ని
  • సబ్జా గింజలు (నానబెట్టినవి) - 2 టేబుల్ స్పూన్లు
  • సోడా నీరు (చల్లని) - టాప్ అప్

తయారీ విధానం

ఒక పెద్ద పిచర్ లేదా కూజా తీసుకుని అందులో పైన పేర్కొన్న రోజ్ సిరప్, నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ సాల్ట్,మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేయండి.

ఆపైన నానబెట్టిన మెత్తని సబ్జా విత్తనాలను వేయండి. సబ్జా వద్దనుకుంటే తులసి విత్తనాలు కూడా ఉపయోగించవచ్చు.

ఇప్పుడు చల్లటి సోడా నీరు తీసుకొని బాగా బ్లెండ్ చేయాలి. అంతే మీ మనసును దోచే రూహ్ ఆఫ్జా రెడీ అయినట్లే. ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.

ఈ డ్రింక్ శరీరంలోని వేడిని తొలగిస్తుంది, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. హిమోగ్లోబిన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం