తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Drinks | ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే ఇవి కూడా తీసుకెళ్లండి

Summer Drinks | ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే ఇవి కూడా తీసుకెళ్లండి

HT Telugu Desk HT Telugu

09 April 2022, 8:31 IST

    • ఈ మండుటెండల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. కానీ ఉద్యోగాలు చేసేవారికి, కాలేజీలలో చదువుకునే వారికి బయటకు వెళ్లడం తప్పదు. అలాంటి వారు తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకు, డీహైడ్రేషన్​కు గురికాకుండా ఉండేందుకు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్​ స్థాయిలను అదుపులో ఉంచే డ్రింక్​లను తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమ్మర్ డ్రింక్స్
సమ్మర్ డ్రింక్స్

సమ్మర్ డ్రింక్స్

Summer Tips | కొన్ని రోజులుగా భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం తొమ్మిది తర్వాత బయటకు వెళ్లాలంటే చాలా కష్టమైపోయింది. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా.. ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం మన బాధ్యతే. నీరు ఎలాగో మనల్ని హైడ్రేట్​గా ఉంచుతుందని తెలుసు. కానీ శక్తినిచ్చే సహాజమైన పానీయాలు కూడా మన వెంటే ఉంటే.. వేసవి తాపాన్ని ఇట్టే తప్పించుకోవచ్చు. పైగా వీటిని తయారు చేసుకోవడం కూడా సులువే కాబట్టి.. మంచి నీళ్ల సీసాతో పాటు.. ఓ బాటిల్ ఈ డ్రింక్స్​ కూడా బయటకు వెళ్లేప్పుడు తీసుకెళ్తే.. సమ్మర్​ను సమ్మగా దాటేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Peanuts for Diabetic: మధుమేహం ఉన్నవారు వేరుశెనగ పలుకులను తినడం ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

నిమ్మరసం : ఎండవేడిని నిలువరించి.. మీకు తక్షణ శక్తిని అందించడంలో నిమ్మరసం ఎప్పుడు ముందు ఉంటుంది. ఇది వేసవిలో మీ దాహాన్ని తీర్చే అత్యుత్తమ డ్రింక్​లలో ఒకటి. పైగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది కచ్చితంగా ఉంటుంది. కాబట్టి సులువుగా దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు.

పుచ్చకాయ జ్యూస్: వేసవి కాలంలో సీజనల్ పండ్లకు దూరంగా ఉండొద్దు. ముఖ్యంగా పుచ్చకాయను అస్సలు వదులుకోవద్దు. వేసవిలో లభించే అత్యంత పోషకమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది పూర్తిగా ఫైబర్‌తో నిండి ఉంటుంది. కాబట్టి ఇది మీ జీవక్రియను అదుపులో ఉంచుతుంది. పైగా ఇది అధికంగా నీరు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు డీహైడ్రేట్ అవ్వలేరు. ఇది మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.

కొబ్బరి నీరు: మీ పక్కనే కొబ్బరి నీళ్ళు ఉన్నప్పుడు కూల్​ డ్రింక్స్ ఎందుకు తీసుకోవాలి? ఎనర్జీ డ్రింక్స్ కంటే.. మీరు కొబ్బరి నీటి నుంచే ఎక్కువ శక్తిని పొందుతారు. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది పూర్తిగా 100% సహజమైనది. కొబ్బరి నీళ్లు వేసవి కాలంలో మీ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు మీ చర్మం, జుట్టును కఠినమైన సూర్య కిరణాల నుంచి కూడా రక్షిస్తాయి.

మజ్జిగ: శరీరాన్ని డీహైడ్రేట్ చేయకుండా ఉంచే పానీయాల గురించి మాట్లాడేటప్పుడు కచ్చితంగా మజ్జిగను చేర్చాల్సిందే. మజ్జిగ పూర్తిగా ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుగా ఉంచుతుంది. ఇది తేలికైన పానీయం కాబట్టి.. సులభంగా జీర్ణమవుతుంది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి.. మిమ్మల్ని రిఫ్రెష్‌ చేస్తుంది.

టాపిక్