Dehydration | ఈ 4 ఆహార పదార్థాలతో.. డీహైడ్రేషన్‌కు చెక్
24 March 2022, 12:27 IST
- వేసవి కాలం రానే వచ్చింది. ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంది. దాదాపు అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా డీహైడ్రేషన్ బారిన పడకుండా.. శరీరంలో నీటి స్థాయిని పెంచుకునేందుకు మనం కొన్ని ఆహారాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
Tips For Summer | మానవ శరీరం ఎక్కువ శాతం నీటితోనే నిండి ఉంటుంది. కాబట్టి శరీరంలో నీరు అనేది చాలా ముఖ్యమైనది. శరీరంలో నీటి సమృద్ధిని ఉంచడం చాలా అవసరం కూడా. కానీ వేసవిలో మాత్రం అధిక చెమట ద్వారా నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో మీరు డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి అదనపు నీటిని తీసుకోవడం మంచిది. ఈ వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మీ రోజువారీ ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
1. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు
మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. లేదా పండ్లు, కూరగాయల సలాడ్‌ను చేర్చుకోవాలి. ఇవి హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తాయి. పుచ్చకాయ, యాపిల్స్, పైనాపిల్స్, నారింజ వంటి ఇతర పండ్లు ఫ్రూట్ సలాడ్‌కు అనువైన ఎంపికలు. దోసకాయ, బ్రోకలీ, టమోటాలు నీరు అధికంగా ఉండే కూరగాయాలు. వీటిని ఆహారంలో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.
2. ఐస్‌డ్ టీ
వేసవిలో వేడి కాఫీ లేదా టీకి బదులుగా ఐస్‌డ్ టీని ఎంచుకోండి. టీ, కాఫీలలో సగం కెఫిన్ ఉంటుంది. కెఫీన్ లేని హెర్బల్, ఫ్రూట్ టీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ఎంపిక అనువైనది కూడా.
3. కొబ్బరి నీరు
వేసవిలో పండ్ల రసాలు తాగడం కన్నా.. కొబ్బరి నీళ్లు తాగడమే మంచిది అంటున్నారు నిపుణులు. కొన్న పండ్ల రసాలలో అదనపు చక్కెర ఉంటుందని.. ఇది కేలరీల కంటెంట్‌ను పెంచుతుందని తెలిపారు. కాబట్టి పండ్ల రసం కంటే కొబ్బరి నీళ్లలో కేలరీలు, చక్కెర తక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుందని వెల్లడించారు. సహజసిద్ధమైన నీరు ఆరోగ్యానికి కూడా మంచిది.
4. పెరుగు
పెరుగు వేసవి భోజనానికి సరైనది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్-రిచ్ గా ఉంటాయి. ప్రోటీన్ మీ ఆకలితో ఉన్న కడుపుని సంతృప్తిపరుస్తుంది. ఉప్పగా ఉండే, అధిక కేలరీల స్నాక్స్‌లు అతిగా తినకుండా మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడే మంచి సూక్ష్మజీవులు.
కాబట్టి ఈ వేసవి తాపాన్ని తగ్గించుకుని... డీహైడ్రేషన్ బారిన పడకూడదు అంటే ఈ ఆహారపదార్థాలను కూడా తీసుకోండి.