Realme Narzo 50i Prime । రియల్‌మి నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు ఇవే
26 June 2022, 14:35 IST
- బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Realme Narzo 50i Prime ఇప్పుడు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలయింది. దీని ధర రూ. 10 వేల లోపే ఉంది. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి..
Realme Narzo 50i Prime
మొబైల్ తయారీదారు Realme ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ Narzo సిరీస్‌లో మరొక మోడల్ ను జత చేసింది. Realme Narzo 50i Prime పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు లిస్టింగ్ లోకి వచ్చింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించనుంది. జూన్ 27 నుండి AliExpress ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఇటీవల వస్తున్న వివిధ రకాల ఫోన్‌ల మాదిరిగానే బాక్సీ డిజైన్‌తో వాటర్‌డ్రాప్ నాచ్ కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ Realme C30 రీబ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అచ్చంగా ఇటీవల విడుదలైన Realme C30ను పోలి ఉన్నాయి. కానీ ఒకే వేరియంట్లో లభించనుంది.
రియల్‌మి నార్జో 50ఐ ప్రైమ్ లోని మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఈ కింద చూడండి.
Realme Narzo 50i Prime స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
- 3GB RAM, 32 GB స్టోరేజ్ సామర్థ్యం
- యునిసోక్ T612 1.82GHz ప్రాసెసర్
- వెనకవైపు 8 MP కెమెరా LED ఫ్లాష్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.0, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ పోర్ట్ , 4G ఎల్‌టిఇ కనెక్టివిటీ ఉన్నాయి.
ఆకుపచ్చ, నీలం రంగు ఆప్షన్లలో లభిస్తున్న Realme Narzo 50i Prime ధర సుమారు రూ. 7,800/-