తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme నుండి చౌకైనా స్మార్ట్‌ఫోన్‌లు.. ధర రూ. 8000 లోపే

Realme నుండి చౌకైనా స్మార్ట్‌ఫోన్‌లు.. ధర రూ. 8000 లోపే

HT Telugu Desk HT Telugu

19 June 2022, 22:33 IST

  • రీయల్ మీ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Realme C30ని జూన్ 20న భారతదేశంలో విడుదల చేయబోతోంది.  రెండు రోజుల తర్వాత మరో స్మార్ట్‌ఫోన్ Realme Narzo 50iని కూడా రీలిజ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు  తెలుసుకుందాం.

Realme Narzo 50i
Realme Narzo 50i

Realme Narzo 50i

ప్రముఖ మెుబైల్ బ్రాండ్ సంస్థ Realme మోడల్స్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సిద్దమవుతుంది. రీయల్ మీ.. తన Realme C30 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 20 న భారతదేశంలో విడుదల చేయబోతోంది. కొద్ది రోజుల తర్వాత మరో స్మార్ట్‌ఫోన్ Realme Narzo 50iని కూడా విడుదల చేయడానికి సిద్దమవువుతుంది. జూన్ 22న విడుదల చేసే అవకాశం ఉంది. రియల్‌ మీ నార్జో 50ఐని రూ. 7,499 ధరలో లభించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే కొత్త ఫోన్ కూడా ఎంట్రీ లెవల్ డివైజ్‌గా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

స్పెసిఫికేషన్‌లు

కంపెనీ ఈ ఏడాదిలో విడుదల చేసే చౌకైన మెుబైల్ ఇదే కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇందులో సింగిల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. కెమెరా LED ఫ్లాష్‌తో వస్తోంది. ఇది సన్నని బెజెల్స్, ఫ్లాట్ అంచులతో రావచ్చు. దీని డిజైన్ ప్యూఛర్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఉంటుంది. కుడి అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఎడమ వైపున SIM ట్రేని అందిచారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000 mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మెుత్తం వస్తుంది.

ధర

Realme Narzo 50i ప్రైమ్ ధర 100 డాలర్లు (సుమారు రూ. 7,800) కంటే తక్కువగా ఉండబోతోంది. Realme Narzo 50i రెండు వేరియంట్లలో ఉన్నాయి. 32 GB వేరియంట్ ధర రూ. 7,499 ఉండగా,, 64 GB వేరియంట్ ధర రూ. 8,499గా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం