తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme V20 5g । రియల్‌మి నుంచి V-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

Realme V20 5G । రియల్‌మి నుంచి V-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

HT Telugu Desk HT Telugu

13 June 2022, 12:30 IST

    • రియల్‌మి కంపెనీ V-సిరీస్‌లో Realme V20 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. Realme V21 5Gని కూడా లైన్లో ఉంచినట్లు సమాచారం. అయితే ఈ ఫోన్లను కంపెనీ ఎందుకో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయడం లేదు. 
Realme V20 5G
Realme V20 5G

Realme V20 5G

చైనీస్ మొబైల్ తయారీదారు Realme తాజాగా Realme V20 5G అనే సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ తమకే ప్రత్యేకమైన V-సిరీస్‌లో ఒక భాగం. Realme V-సిరీస్‌ ఫోన్‌లు ఇప్పటివరకూ కూడా తమ హోం మార్కెట్ అయిన చైనా వెలుపల ఎప్పుడూ తయారు చేయలేదు. రియల్‌మి కంపెనీ పలు మోడల్స్ శాంసంగ్, ఒప్పో లాంటి బ్రాండ్ లకు దగ్గరగా ఉంటున్నాయి. Realme V20 5G కూడా డిజైన్‌ పరంగా Oppo Reno-సిరీస్ ఫోన్‌ల మాదిరిగా ఉంది. అయితే ఇది 5G కేటగిరీలో బడ్జెట్ ఫోన్.

ట్రెండింగ్ వార్తలు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Realme V20 5G స్టార్ బ్లూ, ఇంక్ క్లౌడ్ బ్లాక్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభించనుంది. 

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Realme V20 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  •  6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 4 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 13 MP+ 0.3MP కెమెరా సెట్ ,  ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10 W ఫాస్ట్ ఛార్జర్

ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే  కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, 5G, GPS , USB-C పోర్ట్‌ అలాగే 3.5mm ఆడియో జాక్‌ తదితర స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

ప్రస్తుతం ఇది చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం ధర సుమారు రూ. 11.500/- ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్లో విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది కంపెనీ వెల్లడించలేదు. బహుశా V-సిరీస్‌ను చైనాకే పరిమితం చేస్తుంది కాబట్టి దీనిని ఇతర మార్కెట్లో కంపెనీ విడుదల చేయకపోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం