తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Honey In Winter: చలికాలంలో రోజుకో స్పూన్ ముడి తేనె తీసుకోండి.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!

Raw Honey in Winter: చలికాలంలో రోజుకో స్పూన్ ముడి తేనె తీసుకోండి.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!

17 November 2024, 16:30 IST

google News
    • Raw Honey in Winter: ముడి తేనెలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తీసుకోవడం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముడి తేనెను రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
Raw Honey in Winter: చలికాలంలో రోజుకో స్పూన్ ముడి తేనె తీసుకోండి.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!
Raw Honey in Winter: చలికాలంలో రోజుకో స్పూన్ ముడి తేనె తీసుకోండి.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!

Raw Honey in Winter: చలికాలంలో రోజుకో స్పూన్ ముడి తేనె తీసుకోండి.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!

శీతాకాలంలో వచ్చే చల్లగాలులు మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు వచ్చే డేంజర్ మరీ అధికం. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సీజన్‍లో రోగాల బారిన పడే రిస్క్ తగ్గించుకోవచ్చు. చలికాలంలో ముడి తేనెను ప్రతీ రోజు ఓ స్పూన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.

తుట్టె నుంచి తీసిన తర్వాత ఎక్కువగా శుద్ధి చేయనిదే ముడి తేనె. ప్రాసెస్ చేసిన తేనె కంటే ఈ ముడి తేనెలో ఎంజైమ్‍లు, విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడేందుకు ముడి తేనె మెరుగ్గా సహకరిస్తుంది. చలికాలంలో ఈ ముడితేనెతో కలిగే లాభాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

రోగ నిరోధక శక్తి

ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ముడి తేనెలో మెండుగా ఉంటాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో కణాలు.. ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవకుండా కాపాడుతుంది. సీజన్ వ్యాధుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

బ్యాక్టీరియా, వైరస్‍లను చంపేస్తుంది

ముడి తేనెలో సహజమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ రెండు కలిసి శరీరానికి హానికరమైన బ్యాక్టిరియా, వైరస్‍లను నాశనం చేస్తాయి. అందుకే ముడి తేనె తీసుకుంటే చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది.

వీటి నుంచి ఉపశమనం

చలికాలంలో దగ్గు ఎక్కువ కాలం ఉండడం, గొంతు మంటగా ఉండడం జరుగుతుంటుంది. అయితే, ముడి తేనె వీటి నుంచి ఉపశమనం కలిగేందుకు తోడ్పడుతుంది. ఇది సహజమైన డెముల్సెంట్‍లా పని చేస్తుంది. గొంతులో గరగరను కూడా ఇది తగ్గించలదు. దీంట్లోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు.. ఇన్ఫెక్షన్‍ను పోగొట్టగలవు.

శరీరానికి వెచ్చదనం

ముడి తెనే తింటే శరీరంలో వెచ్చదనం కూడా పుడుతుంది. వెచ్చని గుణం తేనెలో ఉంటుంది. శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచగలదు. అందుకే చలికాలంలో ఈ రకంగానూ మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది.

ఎనర్జీ పెంచుతుంది

వాతావరణం చల్లగా ఉంటే కాస్త నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. అయితే, ముడి తేనె శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. ఇందులోని గ్లూకోజ్, ఫ్రక్టోస్ శక్తిని ఇస్తాయి. అలసట తగ్గిస్తాయి. పూర్తిస్థాయి ఆరోగ్యానికి ముడి తేనె మేలు చేస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

కొందరికి పుప్పొడి అంటే అలర్జీ ఉంటుంది. అలాంటి వారు ముడి తేనెను నేరుగా తీసుకోకూడదు. అలర్జీ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే, ముడి తేనెను మరీ ఎక్కువగా కూడా తీసుకోకూదు. రోజులో ఓ స్పూన్ సరిపోతుంది. గరిష్ఠంగా రెండు స్పూన్‍లు తీసుకోవచ్చు. సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ముడి తేనె తినిపించకూడదు. గర్భిణులు దీన్ని తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఎవరైనా ముడి తేనెను మోతాదు మేరకే తీసుకోవాలి. శుద్ధి చేయనిది కాబట్టి.. శుభ్రంగా ఉందో లేదో కూడా బాగా తనిఖీ చేయాలి.

తదుపరి వ్యాసం