Rakhi 2024: రాఖీ పండగ ఆగస్టు 18 లేదా 19? రాఖీ కట్టడానికి శుభగడియలు, కట్టకూడని సమయం ఇదే
16 August 2024, 16:30 IST
Rakhi 2024: పవిత్రమైన రక్షా బంధన్ పండుగ రోజున మీ సోదరుడికి రాఖీ కట్టడానికి తేదీ, శుభ ముహూర్తం మరియు శుభ సమయం గురించి తెలుసుకోండి.
రక్షాబంధన్ ముహూర్తం
పవిత్రమైన హిందూ పండుగ రక్షా బంధన్. ఇది తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను గుర్తు చేస్తుంది. ఆ బంధాన్ని తెలిపే ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పండగ. అయితే ఈ పండగ తేదీ విషయంలో, సమయం విషయంలో కొన్ని సందేహాలున్నాయి. మీరున్న ప్రాంతం ప్రకారం రాఖీ కట్టడానికి శుభగడియలేంటో తెల్సుకోండి.
ఆగస్టు 18 లేదా 19?
రాఖీ పండుగను ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షా బంధన్ ఆగస్టు 19న, సోమవారం వస్తోంది.
రాఖీ కట్టడానికి సమయం:
దృక్ పంచాంగం ప్రకారం, మీ తోబుట్టువులకు రాఖీ కట్టడానికి మంచి సమయం అపరాహ్ణము. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య సమయాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు భాగాన్ని పూర్వాహ్ణము అంటారు. మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు రెండో సగాన్ని అపరాహ్ణము అంటారు. అంటే మధ్యాహ్నం తర్వాత రాఖీ కట్టొచ్చు. అపరాహ్ణం సమయంలో రాఖీ కట్టలేకపోతే ప్రదోష సమయంలో కట్టొచ్చు. అయితే, భద్ర సమయంలో రక్షా బంధన్ కార్యక్రమాలు మాత్రం చేయకూడదు.
రక్షా బంధన్ శుభ సమయం - మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు
అపరాహ్ణం సమయం ముహూర్తం - మధ్యాహ్నం 1:43 నుండి 4:20 వరకు
ప్రదోష సమయం ముహూర్తం - సాయంత్రం 6:56 నుండి 9:08 వరకు
రక్షా బంధన్ భద్ర ముగింపు సమయం -1:30 గంటలకు
పూర్ణిమ తిథి ప్రారంభం - ఆగష్టు 19, ఉదయం 3:04 గంటలకు
పూర్ణిమ తిథి ముగింపు - ఆగష్టు 19, రాత్రి 11:55 గంటలకు
నగరాల వారీగా రక్షా బంధన్ ముహూర్తాలు:
న్యూఢిల్లీ - మధ్యాహ్నం 1:30 నుంచి 9:08 వరకు
పుణె - మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:14 గంటల వరకు
చెన్నై- మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8:46 వరకు
కోల్ కతా - మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 8:19 గంటల వరకు
హైదరాబాద్ - మధ్యాహ్నం 1:30 నుంచి 8:55 గంటల వరకు
అహ్మదాబాద్ - మధ్యాహ్నం 1:30 నుంచి 9:22 గంటల వరకు
నోయిడా - మధ్యాహ్నం 1:30 నుంచి 9:07 గంటల వరకు
జైపూర్ - మధ్యాహ్నం 1:30 నుంచి 9:12 గంటల వరకు
ముంబయి - మధ్యాహ్నం 1:30 నుంచి 9:19 గంటల వరకు
గుర్‌గావ్- మధ్యాహ్నం 1:30 నుంచి 9:08 గంటల వరకు
బెంగళూరు - మధ్యాహ్నం 1:30 నుంచి 8:56 గంటల వరకు
చండీగడ్ - మధ్యాహ్నం 1:30 నుంచి 9:11 గంటల వరకు
రక్షా బంధన్ గురించి..:
రక్షా బంధన్ వేడుకల సందర్భంగా సోదరీమణులు తమ ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా తమ సోదరుడి చేతులకు పవిత్ర రాఖీని కట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో హారతి, తిలక్ కార్యక్రమాలు కూడా చేస్తారు. తమ సోదరి ప్రేమను నిలబెట్టడానికి, సోదరులు తమ సోదరీమణులను కష్టాల నుండి రక్షించడానికి, ఎల్లప్పుడూ సహాయం చేస్తామని, అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ఆధునిక కాలంలో అక్కాచెల్లెళ్లే కాదు అన్నదమ్ములు కూడా అక్కాచెల్లెళ్ల చేతులకు రాఖీ కట్టడం, సోదరీమణులు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.