Raksha Bandhan: రక్షాబంధన్ రోజు రాఖీ ఎలా కట్టాలి? అది ఎప్పటి వరకు చేతికి ఉంచుకోవాలి?-how to tie a rakhi on raksha bandhan when to tie it and when to take it off ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Raksha Bandhan: రక్షాబంధన్ రోజు రాఖీ ఎలా కట్టాలి? అది ఎప్పటి వరకు చేతికి ఉంచుకోవాలి?

Raksha Bandhan: రక్షాబంధన్ రోజు రాఖీ ఎలా కట్టాలి? అది ఎప్పటి వరకు చేతికి ఉంచుకోవాలి?

Gunti Soundarya HT Telugu
Aug 15, 2024 06:00 AM IST

Raksha Bandhan: ఆగస్ట్ 19న రాఖీ పండుగ జరుపుకోనున్నారు. అయితే ఆరోజు రాఖీ ఎలా కట్టాలి? ఎప్పటి వరకు దాన్ని చేతికి ఉంచుకోవాలి? రాఖీ తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

రాఖీ ఎలా కట్టాలి?
రాఖీ ఎలా కట్టాలి?

Raksha Bandhan: తమ సోదరుడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమకు గుర్తుగా సోదరి అన్న లేదా తమ్ముడికి రాఖీ కడతారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్ట్ 19న జరుపుకుంటున్నారు. రక్షా బంధన్‌లో భద్ర సమయం ఉంది. కాబట్టి భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు.

ఈ సంవత్సరం ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్నం 1.29 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. అందుకే సూర్యోదయానికి ముందు రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నం 1.30 తర్వాత జరుపుకోవాలి. అప్పటి నుంచి ముహూర్తం రాత్రి 7 గంటల వరకు నిరంతరం ఉంటుంది. రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల మధ్య ఉంటుంది. అందుకే సాయంత్రం పూట రాఖీ కట్టడం శ్రేయస్కరం. నిజానికి రక్షా బంధన్ పండుగను జన్మాష్టమి వరకు జరుపుకుంటారు. కుటుంబానికి దూరంగా నివసించే వారు జన్మాష్టమి వరకు రాఖీ కట్టవచ్చు. అయితే రాఖీ ఎలా కట్టాలి? ఇది ఎప్పటి వరకు ఉంచుకోవాలి? ఒక వేళ కట్టిన రాఖీ తెగిపోతే ఏం చేయాలి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

రాఖీ ఎలా కట్టాలి?

రక్షా బంధన్ పండుగను వివిధ ప్రాంతాలలో వారి వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. చాలా చోట్ల, సోదరీమణులు కొబ్బరికాయకు తిలకం పెట్టిన తర్వాత రాఖీ కట్టి అనంతరం కల్వను కట్టి సోదరుడికి ఇస్తారు. కొబ్బరికాయ లక్ష్మీ దేవి చిహ్నంగాభావిస్తారు. అందుకే చాలా చోట్ల ఈ రోజున సోదర తిలకం, రాఖీ కట్టే ముందు సోదరీమణులు సోదరుడికి కొబ్బరికాయ లేదా చిప్పను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత సోదరుడి తిలకం పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి చేస్తారు. దీని తరువాత సోదరుడు తన సోదరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకొని సోదరికి బహుమతిగా ఇస్తాడు.

రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ తప్పనిసరిగా చూసుకోవాలి. సోదరుడు తూర్పు ముఖంగా కూర్చుంటే సోదరి పడమర లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. పొద్దున రాఖీ కట్టించుకుని మధ్యాహ్నానికి తీసేయడం వంటివి చేయకూడదు. జన్మాష్టమి వరకు ఈ రాఖీ ఉంచుకోవాలి. పవిత్రమైన రోజు మాత్రమే దీన్ని చేతి నుంచి తీసేయాలి.

రాఖీని ఎప్పుడు తీసివేయాలి?

రక్షా బంధన్ నాడు రాఖీ కట్టిన తర్వాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలి. రాఖీ నలుపు లేదా నీలం రంగులో ఉండకుండ చూసుకోవాలి. రాఖీ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి. దాని రక్షణ దారం పట్టుతో ఉండాలి. జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర ఉంచండి లేదా పారే నీటిలో వేయండి. రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు.

రాఖీని ఎక్కువ రోజు చేతికి ఉంచుకోకూడదు. జన్మాష్టమి రోజు తీసి నీటిలో వదలాలి. లేదంటే చెట్టు కింద ఉంచాలి. ఒక వేళ చేతికి కట్టిన తర్వాత రాఖీ విరిగిపోతే దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజ గదిలో ఉంచుకోవాలి. లేదంటే నీటిలో విడిచిపెట్టాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.