Raksha Bandhan 2024 Date: రాఖీ పౌర్ణమి ఏ రోజున వచ్చింది? ఆరోజున రాఖీ కట్టేందుకు ఏది మంచి సమయం?
Raksha Bandhan 2024 Date: ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన ఉంది. ఆ రోజున తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? రాఖీ కట్టేందుకు ఏది సరైన సమయమో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఈ రాఖీ పర్వదినం ఉంది. ఈ రోజున మూడు యోగాలు కూడా ఉన్నాయి.
(2 / 5)
రాఖీ పౌర్ణమి తిథి ఆగస్టు 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాలకు మొదలవుతుంది. ఆగస్టు 19 రాత్రి 11.55 నిమిషాలకు ముగుస్తుంది.
(3 / 5)
ఆగస్టు 19వ తేదీన సోదరులకు రాఖీలు కట్టేందుకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 9.08 గంటల వరకు సరైన సమయం. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.39 గంటల మధ్య మరింత శుభప్రదంగా ఉంటుంది.
(4 / 5)
రాఖీ పౌర్ణమి ఉన్న ఆగస్టు 19న భద్ర మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. అందుకే అంత వరకు రాఖీలు కట్టడం మంచిది కాదు. భద్ర ముగిశాక మధ్యాహ్నం 1.30 గంటల తర్వాతే రాఖీలు కట్టే వేడుక చేయాలి.
(5 / 5)
రాఖి పౌర్ణమి పండుగ అయిన ఆగస్టు 19వ తేదీన సర్వార్థ సిద్ధియోగం, శోభన్ యోగం, రవి యోగం కూడా ఉన్నాయి. సర్వార్థ, రవి యోగాలు ఉదయం 5 గంటల 53 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు ఉంటాయి. శోభన్ యోగం రోజు మొత్తం ఉంటుంది. ఆరోజు ప్రదోష్ కాలం సాయంత్రం 6.12 గంటల నుంచి రాత్రి 8.27 గంటల వరకు ఉంటుంది. (గమనిక: శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం ఇచ్చాం. ఏదైనా ఇతర సమాచారం, వ్యక్తిగత ప్రభావం గురించి సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు