Raksha Bandhan: 90 ఏళ్ల తర్వాత రక్షా బంధన్ రోజు 5 శుభ యోగాలు.. రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసుకోండి
Raksha Bandhan: శ్రావణ పూర్ణిమ (ఆగస్ట్ 19) రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రక్షాబంధన్ రోజున కూడా భద్ర, పంచక్ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగను మధ్యాహ్నం పూట జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Raksha Bandhan: రక్షాబంధన్ పండుగను సోదర సోదరీమణుల మధ్య అచంచలమైన ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి తమ ప్రేమ చాటుకుంటారు.
2024 సంవత్సరంలో రక్షాబంధన్ మరింత శుభప్రదంగా ఉండబోతోంది. జ్యోతిష్యులు చెప్పే దాని ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున అద్భుతమైన యాదృచ్చికలు జరుగుతున్నాయి. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్ట్ 19 సోమవారం నాడు పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈసారి సోదర సోదరీమణుల ప్రేమ ఈ పవిత్ర బంధం భద్ర నీడలో ఉంది. ఈ కారణంగా సోదరీమణులు ఉదయం సోదరుడి మణికట్టుపై రక్షాసూత్రాన్ని కట్టలేరు.
5 శుభ యోగాలు
ఈసారి రక్షాబంధన్‌లో సర్వార్థ సిద్ధియోగం, రవి యోగం, సౌభాగ్య యోగం, శోభన యోగాలు ఉన్నాయి. వాటితో పాటు శ్రవణా నక్షత్రం కలిసి రావడం అద్భుతం. కాశీ పంచాంగాల ప్రకారం పూర్ణిమ తిథి ఆగస్టు 18 రాత్రి తెల్లవారుజామున 2:21 గంటలకు(అంటే ఆగస్ట్ 19) ప్రారంభమై ఆగస్టు 19 రాత్రి 12:27 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమిలో సగభాగం భద్రతో నిండి ఉంటుంది. భద్ర రోజు మధ్యాహ్నం 1:24 వరకు ఉంది.
ఈ కారణంగా ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 12:27 వరకు రక్షాబంధన్ శుభకార్యం చేసుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం రక్షా బంధన్ వేడుకను భద్ర కాలంలో నిర్వహించకూడదు. ఈ ఏడాది రక్షాబంధన్ రోజున భద్ర, పంచక్ ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగను ఉదయం వేళ కాకుండా మధ్యాహ్నం పూజ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పౌర్ణమి రోజు మధ్యాహ్నం 1.30 వరకు భద్ర నీడ ఉంటుంది.
భద్ర సూర్యుడి కుమార్తె, శని దేవుడి సోదరి. శని మాదిరిగానే సోదరి భద్ర కూడా చెడు ప్రభావాలు ఇస్తుంది. అందుకే భద్ర కాలంలో చేసే పనులు విజయం కంటే నష్టమే ఎక్కువగా మిగులుస్తాయి. భద్రకాలం గడిచిన తర్వాత రక్షాబంధన్ జరుపుకోవడం మంచిది. రక్షాబంధన్‌ను మధ్యాహ్నం నుండి రాత్రి 8.12 గంటల వరకు శుభ సమయంలో జరుపుకోవచ్చు.
రాఖీ రోజు పంచక్
పూర్ణిమ నాడు రాత్రి 8.12 గంటల నుండి చంద్రుడు కుంభ రాశిలోకి సంచరిస్తాడు. ఈ సమయంలో పంచక్ కూడా మొదలవుతోంది. ఈ పంచక్ హానికరం కాదని పండితులు తెలిపారు. అయినప్పటికీ ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. ఆగస్టు 19వ తేదీ ఉదయం శ్రవణా నక్షత్రం తర్వాత ధనిష్ఠా నక్షత్రం కనిపించడం వల్ల ఇది రాజ్ పంచక్ అవుతుంది. ఇది అశుభమైనదిగా పరిగణించబడదు. అయినప్పటికీ రాఖీ పండుగను జరుపుకునే సోదరులు, సోదరీమణులు పంచక్ ప్రారంభానికి ముందు రక్షాబంధన్ జరుపుకోవాలి. ఈ రోజున వ్రత పౌర్ణమిని కూడా భక్తులు జరుపుకుంటారు.
రక్షాబంధన్ శుభ సమయం
సర్వార్థ సిద్ధయోగం: సూర్యోదయం నుంచి ఉదయం 8.10 వరకు
రవియోగం: సూర్యోదయం నుంచి ఉదయం 8.10 వరకు
శుభ సమయం: మధ్యాహ్నం 2.06 నుండి రాత్రి 8.09 వరకు ఉన్నాయి.