తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Pakodi: హెల్దీగా రాగి పిండి పకోడీలు ఓసారి ట్రై చేయండి, రంగు ముదురుగా ఉన్నా రుచి మాత్రం అదిరిపోతాయి

Ragi Pakodi: హెల్దీగా రాగి పిండి పకోడీలు ఓసారి ట్రై చేయండి, రంగు ముదురుగా ఉన్నా రుచి మాత్రం అదిరిపోతాయి

Haritha Chappa HT Telugu

25 October 2024, 17:30 IST

google News
    • Ragi Pakodi: రాగి పిండితో చేసే వంటకాలు ఎంతో టేస్టీ. మీకు పకోడీలు అంటే ఇష్టమైతే ఒకసారి రాగి పిండితో పకోడీలు ప్రయత్నించండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రాగి పిండి పకోడీ రెసిపీ
రాగి పిండి పకోడీ రెసిపీ

రాగి పిండి పకోడీ రెసిపీ

రాగి పిండిని ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పటివరకు రాగి జావని తాగే వారే కానీ రాగులతో ఇతర వంటకాలు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సాయంత్రం అయితే పకోడీలు తినాలనిపిస్తుంది.

ఇప్పుడు శెనగపిండి పకోడీలే కాదు ఒకసారి హెల్తీగా రాగి పిండి పకోడీలను ప్రయత్నించండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైగా రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రాగి పిండి పకోడీలు ముదురు రంగులో ఉన్నప్పటికీ రుచి టేస్టీ గానే ఉంటాయి. వీటిని ఎలా చేయాలో తెలుసుకోండి.

రాగి పిండి పకోడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - అర కప్పు

ఉల్లిపాయలు తరుగు - మూడు స్పూన్లు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

పల్లీలు - గుప్పెడు

బియ్యప్పిండి - మూడు స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు

అల్లం తరుగు - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కరివేపాకుల తరుగు - రెండు స్పూన్లు

ఇంగువ - చిటికెడు

పసుపు - చిటికెడు

కారం పొడి - అర స్పూను

సోంపు - అర స్పూను

రాగి పకోడీ రెసిపీ

1. రాగి పకోడీని తయారు చేయడానికి ఒక గిన్నెలో రాగి పిండిని వేసుకోవాలి.

2. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని బాగా కలపాలి.

3. ఒక స్పూను నూనె కూడా అందులో వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి.

4. తర్వాత బియ్యప్పిండి, పల్లీలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకుల తరుగు, సోంపు, ఇంగువ, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

5. పది నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అలా వదిలేయాలి. అవసరమైతే కాస్త నీళ్లు పోసుకోవచ్చు.

6. పకోడీలు గట్టిగా చేయాలనుకుంటే నీరు వేయకుండా కలుపుకోవాలి. మెత్తని పకోడీలు కావాలనుకుంటే కాస్త నీరు వేసి ఇడ్లీ పిండిలాగా అయ్యేలా చేసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

8. ఆ నూనెలో రాగి ముద్దను పకోడీల్లాగా వేసుకొని వేయించుకోవాలి.

9. ఇవి రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

10. ఒక టిష్యూ పేపర్ పై వీటిని వేసి అదనపు నూనెను పీల్చేలా చేయాలి. అంతే టేస్టీ రాగి పకోడీలు రెడీ అయినట్టే.

11. వీటిని తింటే క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఇప్పుడు తినే పకోడీలు కన్నా ఈ రాగి పకోడీలు కాస్త వెరైటీగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఉదయాన రాగిజావ తాగడం, మొలకెత్తిన రాగులను తినడం వంటివి చేయడం ద్వారా అందులోని పోషకాలను పుష్కలంగా పొందవచ్చు. ఇక రాగి పకోడీ విషయానికి వస్తే ఇది నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తినేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే దీన్ని డీప్ ఫ్రై చేస్తాము. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఆరోగ్యానికి తరచూ తినడం మంచిది కాదు. అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు.ః

తదుపరి వ్యాసం