Pudina Chole: పూరీతో పుదీనా చోలే కర్రీ ఇలా చేసుకుని తింటే అదిరిపోతుంది
06 August 2024, 11:46 IST
Pudina Chole: మీరు ఇంటికి వచ్చే అతిథుల కోసం పూరీతో పుదీనా చోలే కర్రీని వండితే రుచి అదిరిపోతుంది. టేస్టీ మింట్ చోలే కర్రీ పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది.
పుదీనా చోలే కర్రీ
పూరీ అంటే ఎంతో మందికి ఇష్టం. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పూరీతో పుదీనా చోటే కర్రీ తింటే అదిరిపోతుంది. చపాతీ, రోటీతో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ రెసిపీని తయారు చేసి పెడితే వారు మిమ్మల్ని మెచ్చుకోవడం కష్టం. ఈ రుచికరమైన రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
పుదీనా చోలే రెసిపీకి కావలసిన పదార్థాలు
కొమ్ము శెనగలు - పావు కిలో
పుదీనా ఆకులు - ఒక కప్పు
ఉల్లిపాయలు - మూడు
టమోటాలు - అయిదు
కారం - ఒకటిన్నర స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - అరకప్పు
జీలకర్ర - అర స్పూను
బిర్యానీ ఆకులు - రెండు
టీ ఆకులు - ఒక స్పూను
పుదీనా చోలే రెసిపీ
- పుదీనా ఆకులు మిక్సీలో వేసి నీళ్లు వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి.
- ముందుగా కొమ్ము శెనగలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
- ఉదయాన ఆ కొమ్ము శెనగలను కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి.
4. ఒక కప్పు నీటిలో టీ ఆకులను వేసి బాగా మరిగించాలి.
5. ఒక స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో బిర్యానీ ఆకులు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
6. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటోలు వేసి బాగా కలపాలి. అవి ఇగురులా అయ్యాక కారం, ధనియాల పొడి వేసి వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
7. అందులో ఉడికించిన శనగలు వేసి బాగా కలపాలి. అందులోనే ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్, టీ నీళ్లు వేసి ఉడికించాలి.
8. పచ్చి కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
9. అంటే టేస్టీ పుదీనా చోలే రెడీ అయినట్టే. పూరీతో పాటూ ఈ కర్రీ తింటే రుచి అదిరిపోతుంది.
పుదీనా చోలే రెసిపీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రుచిగా ఉండడమే కాదు, మన శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా పుదీనా తినడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఈ రెసిపీ ఎంతో మంచిది. ఎందుకంటే వీటిలో సహజ చక్కెర ఉండదు. శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. పుదీనా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు పుదీనా తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పుదీనా తినడం వల్ల పొట్ట పరిశుభ్రంగా ఉంటుంది.
టాపిక్