Dates: ఖర్జూర తియ్యగా మాత్రమే కాదు.. అవి చేసే మేలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
21 March 2022, 20:18 IST
- ఖర్జూరను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. సమయానికి అణుగుణంగా ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఖర్జూరాలు శరీరానికి చేసే మరిన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఖర్జూర
ఖర్జూరం ఎంత తియ్యగా ఉంటుందో వాటి వల్ల అంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నగా కనిపించే ఖర్జూరంలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలం. ఖర్జూరను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. సమయానికి అణుగుణంగా ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఖర్జూరాలు శరీరానికి చేసే మరిన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం అలవాటు చేసుకోండి. ఖర్జూర శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అలాగే ఖర్జూరాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం సమస్యలకు దూరం చేస్తోంది
మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినాలి. ఇది వారికి ఖచ్చితమైన ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖర్జూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్తి సమస్య దూరం అవుతుంది.
మరిన్ని ప్రయోజనాలు
బరువు తగ్గాలి అనుకునే వారు, నీరసంతో బాధపడుతున్న వారు ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వైద్యుల సలహా మేరకు గర్భిణులు సరైన మోతాదులో ఖర్జూరాన్ని తినాలి.