తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss | వేగంగా బరువు తగ్గాలనుకుంటే.. ఈ సమస్యలు తప్పవు

Weight Loss | వేగంగా బరువు తగ్గాలనుకుంటే.. ఈ సమస్యలు తప్పవు

Vijaya Madhuri HT Telugu

03 March 2022, 12:13 IST

google News
    • బరువు. ఇది చాలా మందికి ఉండే ప్రధాన సమస్య. తగ్గేందుకు ఒకటా రెండా.. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తిండి నుంచి వ్యాయామాల దాకా ఏదోకటి చేసి బరువు తగ్గితే చాలు అనుకుంటారు. ఈ క్రమంలోనే తొందరగా బరువు తగ్గేందుకు తప్పుదారుల్లోకి వెళ్తారు. అది అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మెల్లగా, ఆరోగ్యవంతంగా బరువు తగ్గితేనే మంచిది అంటున్నారు. త్వరగా బరవు తగ్గితే సైడ్ ఎఫెక్టులు తప్పవంటున్నారు. అవి ఏంటంటే..
వేగంగా బరువు తగ్గితే
వేగంగా బరువు తగ్గితే

వేగంగా బరువు తగ్గితే

Weight Loss | త్వరగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటి ద్వారా వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. వేగంగా బరువు తగ్గడం అసలు మంచిది కాదు అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మంచిది కానీ.. చాలా వేగంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనంటూ హెచ్చరిస్తున్నారు. చాలా మంది.. వేగంగా బరువు తగ్గే ప్రకటనలకు, ప్రక్రియలకు ఆకర్షితులవుతారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. పైగా వేగంగా బరువు తగ్గితే.. పొందే ఫలితాలు ఎక్కువ కాలం ఉండవంటున్నారు. అందుకే నిపుణులు వారానికి 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు నెమ్మదిగా బరువు తగ్గాలని న్యూట్రిషన్ డాక్టర్ నమితా నాడార్‌ సిఫార్సు చేస్తున్నారు.

దుష్ప్రభావాలివే..

1. పోషకాహార లోపాలు

వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్‌లను అనుసరిస్తే, అది మీ శరీరంలో పోషకాహార లోపానికి దారితీయవచ్చు. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని డాక్టర్ నాడార్ తెలిపారు. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. ఇబ్బందులు తప్పవంటున్నారు.

2. జుట్టు రాలడం

మీరు త్వరగా బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పుడు, మీరు మీ ఆహారంపై చాలా పరిమితులు విధించాల్సి ఉంటుంది. ఇది మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. మీరు మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మెరిసేలా ఉంచుకోవాలంటే సరైన పోషకాలు అవసరమని అర్థం. కాబట్టి, మీరు జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, మీ బరువు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఆహారంలో చాలా పోషకాలను పరిమితం చేస్తున్నారని అర్థం.

3. కండరాల నష్టం

క్యాలరీ-నిరోధిత ఆహారం కొవ్వు తగ్గడం కంటే కండరాలపై ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మీ శరీర శక్తి కొవ్వు కంటే ముందుగా మీ కండరాలను తినడం ప్రారంభిస్తుంది. కండరాల కొవ్వు కంటే మెటబాలికల్ యాక్టివ్‌గా ఉండడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు వెల్లడిస్తున్నారు. చాలా వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లకు కారణం అవుతాయంటున్నారు.

4. స్లో మెటబాలిజం

బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ నెమ్మదిస్తుంది. బరువు తగ్గడానికి రోజుకు చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇది హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది.

5. డీహైడ్రేషన్

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మీరు డీహెడ్రేషన్​కు అనుమతించకూడదు. కాబట్టి మీరు నిర్జలీకరణానికి గురైనట్లయితే.. ఇది వేగంగా బరువు తగ్గేందుకు అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? బరువు తగ్గడానికి ద్రవాలను తగ్గిస్తే.. ఇలాంటి నిర్జలీకరణకు గురవుతారని డాక్టర్ నాడార్ తెలిపారు. ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు.

ఇతర దుష్ప్రభావాలు

* శక్తి తగ్గడం

* పెళుసైన జుట్టు మరియు గోర్లు

* విపరీతమైన అలసట

* రాజీపడిన రోగనిరోధక వ్యవస్థ

* బలహీనమైన ఎముకలు, బోలు ఎముకల వ్యాధి

* తలనొప్పి

* చిరాకు

* మలబద్ధకం

అందుకే మెల్లగా బరువు తగ్గడమే మంచిదంటున్నారు నిపుణులు. వేగంగా తగ్గాలని చూసి లేని పోని సమస్యలను కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం