తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lifestyle And Cancer : క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు ఇలా చేయాల్సిందే

Lifestyle and Cancer : క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు ఇలా చేయాల్సిందే

HT Telugu Desk HT Telugu

18 February 2023, 14:32 IST

    • Prevention of cancer : క్యాన్సర్‌తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం, జీవనశైలి క్యాన్సర్‌కు కారణం. మన జీవనశైలిలో కొన్ని మార్పులతో క్యాన్సర్ వ్యాధి నుండి దూరంగా ఉండటానికి సహాయపడతాయి.
వ్యాయామం
వ్యాయామం (Unsplash)

వ్యాయామం

చాలా మంది క్యాన్సర్‌(Cancer) వ్యాధితో బాధపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ(WHO) ప్రకారం క్యాన్సర్ వ్యాధికి చాలా మంది ప్రజలు మృతి చెందుతున్నారు. భారతదేశంలో క్యాన్సర్ వ్యాధికి వస్తున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. పిల్లలు, వయోవృద్ధులు, యువకులు ఈ మహమ్మారితో బాధపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

Gulab jamun with Rava: ఉప్మా రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, మృదువుగా టేస్టీగా వస్తాయి

క్యాన్సర్‌తో శరీరంలోని రోగనిరోధక శక్తి(immunity) తగ్గినపుడు క్యాన్సర్‌ గడ్డ అభివృద్ధి చెందుతుంది. అధ్యయనాల ప్రకారం 10 శాతం మాత్రమే అనువంశికంగా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది. మిగిలిన వ్యక్తులకు రావడానికి పర్యావరణం, జీవనశైలి(Lifestyle)యే కారణం. మన జీవనశైలిలో కొన్ని మార్పులు ఈ వ్యాధి నుండి దూరంగా ఉండటానికి సహాయపడతాయి.

నిరంతరం శరీరాన్ని కార్యకలాపాలు నిర్వహించేలా చూసుకుంటే క్యాన్సర్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాయామం(Exercise) చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది సాధారణంగా మన క్షేమంగా ఉండేలా చేస్తుంది. కనీసం 40 నిమిషాలపాటు సైక్లింగ్‌, వాకింగ్‌, యోగా వంటి శారీరక కార్యకలాపాలు చేయడం వల్ల క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చు.

నేడు చాలా ఆరోగ్య సమస్యలకు కారణం.. సరైన తిండి(Food) లేకపోవడమే. ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల రోగాలు మనిషి చుట్టూ వచ్చి చేరుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. విటమిన్, ఖనిజ, లవణాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వివిధ రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం.

అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారిలో మూడో వంతు మంది తాంబాకు తీసుకోవడం జరుగుతుంది. సిగరేట్(Cigarette) తాగడంతో శ్వాసకోస క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంది. దూమపానం నుండి నోటి, శ్వాసకోస.. ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.

అతిగా అల్కాహాల్(alcohol) తీసుకోవడం కూడా క్యాన్సర్‌కు కారణం. నిర్దిష్ట మోతాదులో శరీరానికి మద్యపానం చేరడం వల్ల ఇబ్బంది లేదని పరిశోధకులు తెలియజేసినప్పటికీ.., ఇది పూర్తిగా ఏ విధమైన ఇబ్బందికరంగా ఉండదు అని చెప్పలేం. మద్యపానంతో క్యాన్సర్, మూత్రకోశ, గుండె సంబంధిత వ్యాధులు కనిపించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం