అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్లు... డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!
కరోనా కేసుల పెరుగులపై ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం చేసింది. వైరస్ పూర్తిగా క్షీణించలేదని.. ఇంకా దృడంగానే ఉందని వెల్లడించింది. చర్యలు చేపట్టకపోతే కొత్త వేరియంట్ల వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాల వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనా, కొరియా వంటి దేశాల్లో వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే కొత్త వేరియంట్ల పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖ పడటంతో వ్యాప్తి మరింత సులభమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ వ్యాఖ్యానించారు. వైరస్ ధృడంగానే ఉందని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా అన్ని దేశాలు కూడా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్వల్ప విరామం తర్వాత వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు.