Cold and Cough During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో జలుబు, దగ్గు ఉంటే ఏం చేయాలి?
03 February 2023, 18:30 IST
- Cold and Cough During Pregnancy : గర్భధారణ సమయంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అయితే వాటి గురించి కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తారు. అలా ఆలోచించి.. ఇంకా ఆరోగ్యం పాడుచేసుకుంటారు. అయితే నటి నేహా మర్దా గర్భంతో ఉంది కొన్ని చిట్కాలు చెప్పింది.
ప్రెగ్నెన్సీ టిప్స్
గర్భధారణ(Pregnancy) సమయంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావొచ్చు. అయితే బాలిక వధులో నటించిన నేహా మర్దా గర్బంతో ఉంది. కొన్ని సలహాలతో వీడియోను షేర్ చేసుకుంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు జలుబు లేదా దగ్గు వస్తే ఎలా జాగ్రత్త వహించాలో చెప్పింది.
క్రమంగా వాతావరణం(Weather) మారుతూ చలికాలం కూడా తగ్గుతోంది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం(Fever) వంటి అనేక వ్యాధులు కూడా వస్తుంటాయి. ఈ సీజన్‌లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ సమయంలో గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రకాల మందులు వాడుతుంటారు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు ఇంట్లోనే పాటిస్తే.. దగ్గు, జలుబు లాంటివి తగ్గించుకోవచ్చట.
బాలికా వధు చిత్రంలో కనిపించిన నటి నేహా మర్దా(Neha Marda) పాట్నాకు చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. గత ఏడాది నవంబర్‌లో నేహా తన ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించింది. ఈ జంట త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. కొన్ని నెలలుగా నటి తన ప్రెగ్నెన్సీ జర్నీని తన అభిమానులతో పంచుకోవడంతో పాటు ముఖ్యమైన చిట్కాలను ఇస్తోంది. ఇటీవల, ఆమె ఒక వీడియోను పంచుకోవడం ద్వారా, గర్భధారణ సమయంలో స్త్రీకి జలుబు లేదా దగ్గు వస్తే ఎలా జాగ్రత్త వహించాలో చెప్పింది.
జలుబు, దగ్గు విషయంలో రోజుకు 4 సార్లు ఆవిరి పట్టాలని నేహా మర్దా చెబుతోంది. దీనితో పాటు, ఉప్పు(Salt), పసుపు కలిపిన గోరువెచ్చని నీటితో రోజుకు మూడు సార్లు పుక్కిలించడం మంచిది. మరోవైపు ఆకుకూరల కట్టను వేయించి వాసన చూడొచ్చట. అనారోగ్యంతో ఉన్నప్పుడు, వీలైనంత ఎక్కువ హైడ్రేట్‌గా ఉండండి. వీలైనంత విశ్రాంతి తీసుకోండి అని నటి చెప్పింది.
గర్భధారణ సమయంలో జలుబు లేదా వైరల్ ఫివర్ వంటి వ్యాధులను నివారించడానికి, నటి కొన్ని చిట్కాలను ఇచ్చింది. వాటిని మీరు కూడా అనుసరించవచ్చు..
మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
సరిగా నిద్రపోండి.
ఆరోగ్యకరమైన వాటిని తినండి.
మీ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండకండి.
బయటకు వెళితే మాస్క్ ధరించండి.
ఒత్తిడికి దూరంగా ఉండండి.
అయితే, ఇది వైద్య సలహా కాదని కొన్ని ఇంటి నివారణలాగా అనుసరించవచ్చని నటి నేహా చెప్పింది.