Steaming Benefits for Beauty : ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఆవిరి పట్టండి..-find these 7 amazing health benefits from face steaming ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Steaming Benefits For Beauty : ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఆవిరి పట్టండి..

Steaming Benefits for Beauty : ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఆవిరి పట్టండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 27, 2022 07:30 AM IST

Steaming Health Benefits : ఫేస్ అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ముఖ వర్చస్సు కోసం అందుబాటులో ఉన్న బ్యూటీ టిప్స్ ఎన్నో వాడుతాం. అయితే స్టీమింగ్ కూడా మీ ముఖం ప్రకాశవంతంగా మార్చేందుకు సాయపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవిరితో అందానికి ప్రయోజనాలు
ఆవిరితో అందానికి ప్రయోజనాలు

Steaming Health Benefits : ముఖానికి స్టీమింగ్ చాలా మేలు చేస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే మీరు ఫేస్ స్టీమింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది మీ ముఖానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో.. ఎందుకు ముఖానికి స్టిమింగ్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెన్సింగ్‌లా పనిచేస్తుంది..

మీ చర్మ రంద్రాలను తెరిచి దానిలోలోతుల్లో ఉండే మలినాలను తొలగించేలా క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇదే సమయంలో మీ మొటిమలను మృదువుగా మార్చి అవి సులువుగా ఊడిపోయేలా చేస్తుంది.

ఆ బ్యాక్టిరియాను తొలగిస్తుంది

మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను స్టీమింగ్ తొలగిస్తుంది. వెచ్చని ఆవిరి చర్మ రంద్రాలు తెరుచుకునేలా చేస్తుంది. మృత కణాలు బయటకు వచ్చేలా చేస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర మలినాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి.

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

వేడి ఆవిరి, స్వేదం మీ రక్త నాళాలను వ్యాకోచింపజేస్తాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆ భాగానికి ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. తద్వారా మీ ముఖం సహజమైన మెరుపు సంతరించుకుంటుంది.

కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తికి మేలు

ఫేస్ స్టీమింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగై కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి మొదలవుతుంది. తద్వారా మీ చర్మం నవ యవ్వనాన్ని సంతరించుకుంటుంది.

సెబమ్ విడుదలకు సహకరిస్తుంది

సెబమ్ సహజంగా లభించే నూనె. మీ చర్మం, జుట్టును లూబ్రికేట్ చేయడానికిసేబాషియస్ గ్రంధులు దీనిని ఉత్పత్తి చేస్తాయి. సెబమ్ మీ చర్మం లోపలి పొరల్లో చిక్కుకుపోయినప్పుడు ఈ సెబమ్‌ బ్యాక్టీరియాకు, మొటిమలకు కారణమవుతుంది. స్టీమింగ్ ఈ ప్రక్రియను నిలిపివేసి సెబమ్ విడుదలకు సహకరిస్తుంది.

రిలాక్సేషన్ ఇస్తుంది

స్టీమింగ్ చేసినప్పుడు మీ ముఖం చాలా రిలాక్స్ అవుతుంది. స్టీమింగ్‌లో ఆరోమా థెరపీకి సంబంధఇంచిన ఆయిల్స్ కాస్త జత చేస్తే మీకు చాలా ప్రశాంతత చేకూరుతుంది.

సైనసైటిస్ నుంచి ఉపశమనం

ఫేస్ స్టీమింగ్ సైనసైటిస్ నుంచి ఉపశమనం ఇస్తుంది. సైనసైటిస్ కారణంగా ఎదురయ్యే తలనొప్పుల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం