తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plum Cake Recipe : ప్లమ్ కేక్​ని తయారు చేయడం చాలా సుభలం.. రెసిపీ ఇదిగో..

Plum Cake Recipe : ప్లమ్ కేక్​ని తయారు చేయడం చాలా సుభలం.. రెసిపీ ఇదిగో..

13 December 2022, 7:15 IST

    • Plum Cake Recipe : క్రిస్మస్ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. న్యూ ఇయర్​కి కూడా ఎన్నో రోజులు మిగిలి లేవు. అయితే ఈ సమయంలో చాలామంది తమ ఆనందాన్ని కేక్​లతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు కూడా కేక్ చేయాలనుకుంటే ఇక్కడ మీకో టేస్టీ, సింపుల్ రెసిపీ ఉంది.
ప్లమ్ కేక్
ప్లమ్ కేక్

ప్లమ్ కేక్

Plum Cake Recipe : కేక్స్ అనేవి ప్రతి సెలబ్రేషన్​ను మరింత రెట్టింపు చేస్తాయి. పండుగలకనే కాదు.. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఏ ఈవెంట్​కి అయినా ఇవి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. పైగా క్రిస్మస్ అంటే కేక్​లకు పెట్టింది పేరు. పండుగలనే కాకుండా మీరు కూడా కేక్స్ చేయాలి.. ఇంట్లోని వారికి తినిపించాలని కోరుకుంటే.. మీరు కచ్చితంగా ఈ ప్లమ్ కేక్ ఎలా చేయాలో నేర్చుకోవాల్సింది. దీనిని చేయడం కూడా చాలా ఈజీ. కావాల్సిన పదార్థాలు ఉంటే.. మీరు ఈజీగా ఈ కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కావాల్సిన పదార్థాలు

* ఓవెన్ - 150 C-300 C (ప్రీ హీట్ చేసుకోవాలి)

* వెన్న - 1 కప్పు

* పంచదార - 1 1/2 కప్పు

* గుడ్లు - 6

* బాదం - 125 గ్రాములు (తరిగి పెట్టుకోవాలి)

* వెనిలా ఎసెన్స్ - 2 tsp

* మిక్స్డ్ ఫ్రూట్స్ - 2 1/2 కప్పులు

* మైదా పిండి - 2 కప్పులు

* కేక్ టిన్ - 1

* బ్రౌన్ పేపర్ లేదా ఆయిల్ పేపర్ - 1

తయారీ విధానం

మిక్స్డ్ ఫ్రూట్స్, బాదంపప్పులను.. మైదా పిండితో కలపండి. వెన్న, చక్కెర, గుడ్లు, వెనీలాను వేసి.. బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఉండలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు కేక్ ట్రే తీసుకుని.. దానికి వెన్న పూసి.. అడుగున బ్రౌన్ పేపర్ వేయండి. కేక్ మిశ్రమాన్ని ట్రేలో వేసి.. ఒకసారి టాప్ చేయండి. దీనిని 30-40 నిమిషాలు ముందుగా వేడిచేసిన ఓవెన్లో ఉంచి బేక్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ ప్లమ్ కేక్ రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం