తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Period Cramps : పీరియడ్స్ సమయంలో వాటికి దూరంగా ఉండండి.. వీటిని ఫాలో అవ్వండి

Period Cramps : పీరియడ్స్ సమయంలో వాటికి దూరంగా ఉండండి.. వీటిని ఫాలో అవ్వండి

06 October 2022, 9:47 IST

google News
    • Rid of Period Cramps : ఋతుక్రమం సమయంలో వచ్చే క్రాంప్స్ చాలా బాధపెడతాయి. ఈ విషయం ప్రతి అమ్మాయికి తెలిసిందే. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల వీటి పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు. ఆ సమయంలో ఎలాంటి పనులు చేస్తే.. ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
పీరియడ్స్ క్రాంప్స్
పీరియడ్స్ క్రాంప్స్

పీరియడ్స్ క్రాంప్స్

Rid of Period Cramps : కొన్నిసార్లు పీరియడ్స్ క్రాంప్స్ ప్రారంభంలో ప్రసవం వలె బాధాకరంగా ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ ప్రారంభంలో చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పి తగ్గించుకుందామని.. మీ నెలవారీ సమయంలో నొప్పి నివారణ మందులను వాడినా.. అవి ఏదొక రకంగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఈ రకమైన బాధలను వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. పీరియడ్ నొప్పి లేదా ఋతు నొప్పి.. మీరు తీసుకునే కొన్ని ఆహారాలవల్ల కూడా కావొచ్చు అంటున్నారు వైద్యులు.

అదనపు నూనె

కూరగాయల నూనెలు, శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెర, ఆల్కహాల్ అధిక వినియోగం మీ పీరియడ్స్​పై బాగా ప్రభావం చూపిస్తాయి. ఇవి మీ కణాలను దెబ్బతీస్తాయి. మీ హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. సెల్ కమ్యూనికేషన్‌లో జోక్యం చేసుకుంటాయి. దీనివల్ల పీరియడ్ సమయంలో మీకు క్రాంప్స్ ఎక్కువ వచ్చే అవకాశముంది.

ఇన్సులిన్ స్థాయిలు

మీ శరీరంలో ఇన్సులిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల కూడా ఋతుస్రావం నొప్పి రావచ్చు. ఇన్సులిన్ నొప్పిని మాత్రమే కలిగించదు కానీ గడ్డకట్టడానికి దారితీస్తుంది. మీ అండోత్సర్గానికి ఆటంకం కలిగిస్తుంది.

థైరాయిడ్

మీరు థైరాయిడ్ గ్రంధికి దూరంగా ఉంటే మంచిదే. కానీ మీకు థైరాయిడ్ ఉంటే ప్రతి నెలా ఆ తిమ్మిరిని మరింత ఎక్కువ పొందే అవకాశం ఉంది. థైరాయిడ్ స్థాయిలో అసమతుల్యత భారీ రక్తస్రావం కలిగిస్తుంది. తక్కువ నుంచి బాధాకరమైన రక్తస్రావం అవుతుంది.

ధూమపానం

పిరియడ్ క్రాంప్స్​ని ధూమపానం ఎక్కువ చేస్తుందని అందరికీ తెలిసిందే. సిగరెట్ తాగడం ఒక ముఖ్యమైన ప్రమాద కారకం అని పరిశోధకులు నిరూపించారు. దానిని మానేయడం మీకు కష్టంగా ఉండొచ్చు కానీ.. తర్వాత ఫలితం మిమ్మల్ని హాయిగా చేస్తుంది.

పీరియడ్స్ నొప్పిని ఇలా తగ్గించుకోండి?

* హైడ్రేటెడ్ గా ఉండండి.

* హీటింగ్ ప్యాడ్‌లను ఉపయోగించండి.

* వ్యాయామం చేయండి.

* బాగా విశ్రాంతి తీసుకోండి.

ఇవన్నీ ఫాలో అయినా కూడా.. మీకు నొప్పి ఎక్కువగా ఉంటే.. మీ గైనకాలజిస్ట్‌ని సందర్శించండి.

టాపిక్

తదుపరి వ్యాసం