తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits To Avoid With Diabetes: డయాబెటిస్ ఉందా? అయితే ఈ పండ్లు అస్సలు తినకండి..

Fruits to avoid with Diabetes: డయాబెటిస్ ఉందా? అయితే ఈ పండ్లు అస్సలు తినకండి..

HT Telugu Desk HT Telugu

25 August 2023, 11:53 IST

google News
    • డయాబెటిస్ సమస్య ఉన్నవారు కొన్ని పండ్లకు వీలైనంత దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే వాటిని సేవించాలి అంటున్నారు నిపుణులు.
డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లను తినకూడదు?
డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లను తినకూడదు?

డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లను తినకూడదు?

డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మధుమేహ సమస్య తీవ్రమవుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు.. కొన్ని పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివైనా.. వాటికి దూరంగానే ఉండాలి అంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి కొన్ని పండ్లకు దూరంగా ఉండాలి అంటున్నారు.

ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. వాటిలో కొన్ని మీ రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని.. మరికొన్నింటిని మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏమిటో? వేటిని మితంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లిచీ

అధిక చక్కెర కంటెంట్, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉన్న కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు లీచీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవి ఎక్కువ తీపిని కలిగి ఉండడం వల్ల.. వీటిని తరచుగా డెజర్ట్‌లు, కాక్‌టెయిల్‌లలో స్వీటెనర్‌గా ఉపయోగిస్తారు.

ఒక్కో సర్వింగ్‌లో వీటిలో 29 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు కారణమవుతుంది. అందుకే మధుమేహం ఉన్న వ్యక్తులు లీచీలకు దూరంగా ఉండడం చాలాముఖ్యం.

అరటిపండ్లు

అరటిపండ్లు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్‌ను కలిగి ఉంటాయి. అందుకే ఇవి మీ బ్లడ్ షుగర్‌ను త్వరగా పెంచుతాయి. కానీ మీరు వాటిని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఎక్కువగా తీసుకుంటే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి వాటితో కలిపి ఓ చిన్న అరటిపండును తీసుకోవచ్చు. లేదంటే పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

మామిడిపండ్లు

పండ్లలో రారాజుగా పేరుగాంచిన మామిడిపండ్లను చాలా మంది ఇష్టపడతారు. కానీ మీకు మధుమేహం ఉంటే మాత్రం మామిడిపండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి.

ఒక్క మామిడి పండ్లలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. కాబట్టి మీరు మామిడిపండ్లను పూర్తిగా మానేయడం లేదా మితంగా తీసుకోవాలి.

పైనాపిల్స్

అధిక చక్కెర, కార్బోహైడ్రేట్ కంటెంట్ పైనాపిల్‌లో ఎక్కువగా ఉంటాయి. ఒక పైనాపిల్‌లో దాదాపు 46 గ్రాముల చక్కెర, 96 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్‌ను తీసుకునే ముందు అలెర్ట్ గా ఉండాలి.

పైనాపిల్స్ యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వాటిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.

పుచ్చకాయ

క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే అధిక నీటి శాతం పుచ్చకాయలో ఉంటుంది కాబట్టి దీనిని ఆహారంలో తీసుకోవాలి. కానీ పుచ్చకాయలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి దీనిని మధమేహం ఉన్నవారు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

సపోటా పండు

సపోటా పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 57. అందువల్ల ఇది తినగానే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పైగా ఇది అధిక కార్బొహైడ్రేట్లు కలిగిన పండు. ఒక మీడియం సైజ్ సపోటా పండు 100 కాలరీల శక్తి, 15 గ్రాముల షుగర్ ఇస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలి.

ఇవే కాకుండా గ్రేప్స్, పండ్ల రసాలు, అధిక చక్కెరలు కలిగి ఉండే కొన్ని రకలా డ్రైఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి.

తదుపరి వ్యాసం