International Yoga Day 2023 | మధుమేహులకు రక్తంలో చక్కెరను నియంత్రించే కొన్ని యోగా ఆసనాలు!-international yoga day 2023 here are a few yoga asanas to manage blood sugar for people with diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  International Yoga Day 2023 Here Are A Few Yoga Asanas To Manage Blood Sugar For People With Diabetes

International Yoga Day 2023 | మధుమేహులకు రక్తంలో చక్కెరను నియంత్రించే కొన్ని యోగా ఆసనాలు!

HT Telugu Desk HT Telugu
Jun 18, 2023 05:30 AM IST

International Yoga Day 2023: అనేక వ్యాధులను నయం చేసే శక్తి కూడా యోగాకు ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఎక్కువ మందిని పీడిస్తున్న మధుమేహంను నియంత్రించే యోగాసనాల గురించి తెలుసుకోండి.

International Yoga Day 2023: Yoga tips to manage blood sugar levels for people with diabetes
International Yoga Day 2023: Yoga tips to manage blood sugar levels for people with diabetes (pixabay)

International Yoga Day 2023: యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నాటి భారతీయ ఆధ్యాత్మిక సాధన, ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక గొప్ప వరం ఈ యోగా. ఇది మనస్సును, శరీరాన్ని ఏకం చేసి రెండింటి మధ్య సమన్వయం తీసుకురాగల ఒక అద్వితీయమైన అభ్యాసం. యోగా అనే పదం సంస్కృత మూలం 'యుజ్' నుండి ఉద్భవించింది, దీని అర్థం ఏకం చేయడం. యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన కళ. ఇది మీకు వ్యాయామాలకు మించిన శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పురాతన శాస్త్రంలో అనేకమైన ఆసనాలు ఉన్నాయి. యోగాసనాలను సాధన చేయడం ద్వారా మీరు అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండైన జీవితాన్ని గడపవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి సంవత్సరం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు. యోగా యొక్క శక్తి, సామర్థ్యాల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రాముఖ్యత కలిగి ఉంది. అనేక వ్యాధులను నయం చేసే శక్తి కూడా యోగాకు ఉంది. అలాంటి కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నేడు ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా విడిపోయి రక్తప్రవాహంలో విడుదలవుతుంది. ఇది మనం రోజువారీగా అనేక పనులను చేయడానికి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే, మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో పెద్ద మొత్తంలో గ్లూకోజ్ విడుదలవుతుంది, ఈ పరిస్థితినే హైపర్ గ్లైసీమియా అని కూడా అంటారు. ఇది శరీరానికి పెద్ద సమస్యగా ఉంటుంది, తదనంతరం ఇతర అనేక వ్యాధులకు కారణం అవుతుంది, అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే ఈ పరిస్థితిని నియంత్రించడంలో కూడా యోగా సహాయపడుతుంది.

HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ, అక్షర యోగ సంస్థల వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ మాట్లాడుతూ, "మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో మీకు సహాయపడే కొన్ని భంగిమలను యోగా అందిస్తుంది. ఈ ఆసనాల సాధనతో మీ మధుమేహం సమస్యకు చికిత్స జరిగినట్లు అవుతుంది. మీరు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఏదైనా ఒకదాన్ని సాధన చేయవచ్చు.

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే యోగా ఆసనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

మండూకాసనం

ఈ ఆసనం కడుపు సమస్యలను తగ్గించడంలో , మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఉదర అవయవాలను టోన్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

కుర్పర దండాసనం

ఈ ఆసనం జీర్ణ అవయవాల పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. వెన్ను, తుంటి గాయాల నుంచి ఉపశమనం అందిస్తుంది.

పాద అంగుష్టాసనం

ఇది మెదడును శాంతపరచడంలో, స్నాయువులను సాగదీయడంలో, తొడ కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో , నిద్రలేమి లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

పశ్చిమోత్తనాసనం

ఈ ఆసనం వెన్నెముక కదలికకు సహాయపడటమే కాకుండా శరీరానికి ఫ్లెక్సిబిలిటీని పెంచడంలో సహాయపడుతుంది.

మీ శరీరంలోని అంతర్గత అవయవాలు యోగా ఆసనాల ద్వారా సాగదీయబడతాయి, వాటికి మసాజ్ చేసినట్లుగా అవుతుంది. పైన పేర్కొన్న నాలుగు భంగిమలను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. వాటి కార్యాచరణ, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇలా మీ ఆరోగ్యానికి చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది అని యోగా నిపుణులు పేర్కొన్నారు.