తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : తల్లిదండ్రులు పిల్లలతో ఏ వయసు వరకు నిద్రించాలి? లేదంటే వచ్చే సమస్యలేంటి?

Parenting Tips : తల్లిదండ్రులు పిల్లలతో ఏ వయసు వరకు నిద్రించాలి? లేదంటే వచ్చే సమస్యలేంటి?

Anand Sai HT Telugu

05 June 2024, 9:30 IST

google News
    • Parenting Tips : చిన్న వయసులో పిల్లలను ముద్దు చేస్తాం. వారితోనే కలిసి పడుకుంటాం. కానీ ఎదిగే క్రమంలో పిల్లలతో కలిసి నిద్రపోకూడదు. ఏ వయసులో పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టాలో తెలుసుకోండి..
పిల్లలతో కలిసి ఏ వయసు వరకు నిద్రించాలి?
పిల్లలతో కలిసి ఏ వయసు వరకు నిద్రించాలి?

పిల్లలతో కలిసి ఏ వయసు వరకు నిద్రించాలి?

పిల్లలకు వేర్వేరు నిద్ర విధానాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు దిండ్లు, దుప్పట్లు, బొమ్మలతో నిద్రపోతారు. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో పడుకుంటారు. కొంతమంది పిల్లలు తమ తల్లిని కౌగిలించుకుని నిద్రపోతారు. లేదంటే వారికి అస్సలు నిద్రపట్టదు. అయితే ఇది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఫర్వాలేదు. కానీ పెద్ద అవుతుంటే మాత్రం ఈ అలవాటు మంచిది కాదు.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పడుకునే.. ఈ స్లీపింగ్ ప్యాటర్న్‌ని ఇష్టపడతారు. కానీ పిల్లలు పెరిగేకొద్దీ, తరచుగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే? ఆ సమయంలో పిల్లలు విడివిడిగా నిద్రపోవడం కష్టం అవుతుంది. వారు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. మీతో తీసుకెళ్లేందుకు కుదరదు. కాబట్టి దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.

ఒంటరిగా నిద్రించనివ్వండి

పిల్లలు ఒంటరిగా నిద్రపోవడాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలో తెలుసా? చిన్నతనంలో తల్లిదండ్రులతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అందువలన పడుకోవడం తప్పు కాదు. కానీ పిల్లలు పెరిగేకొద్దీ ఒంటరిగా నిద్రపోవడానికి అలవాటు చేయాలి. ఒక్కోసారి అనేక ఉద్యోగాల కారణంగా పిల్లలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు ఒంటరిగా నిద్రించడం నేర్చుకోవడం మంచిది. లేదంటే రోజూ రాత్రుళ్లు మీకు ఫోన్ చేసి ఏడుస్తారు.

క్రమంగా అలవాటు చేయండి

అకస్మాత్తుగా మీ బిడ్డను ఒంటరిగా నిద్రించమని బలవంతం చేయవద్దు. ఎందుకంటే ఏ పిల్లవాడు కూడా అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటానికి అలవాటుపడడు. ఇందుకోసం మొదట్లో వారానికి రెండు మూడు సార్లు ఒంటరిగా నిద్రపోవడానికి అలవాటు చేయాలి. నిద్రిస్తున్న రోజుల సంఖ్యను క్రమంగా పెంచండి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా నిద్రపోవడం అలవాటు అవుతుంది.

కథలు చెప్పి పడుకోబెట్టండి

అయితే మెుదట్లో వేరుగా పడుకునేందుకు పిల్లలు మారం చేస్తారు. పిల్లలు బ్రష్ చేసి నైట్ డ్రెస్ వేసుకోనివ్వండి. లైట్ ఆఫ్ చేసి, పడుకునే ముందు గుడ్‌నైట్ చెప్పండి. కాసేపు వారితోనే ఉండి కథలు చెప్పండి. తర్వాత మీరు వేరే గదిలోకి వెళ్లిపోండి. ఇలా చేయడం వల్ల పిల్లలు త్వరగా నిద్రపోవడానికి అలవాటు పడతారు.

ఏ వయసులో వేరుగా నిద్రించాలి?

పిల్లలు తల్లిదండ్రులతో పడుకోవడం 8 సంవత్సరాల వయస్సులోనే ఆపేసేలా చేయాలి. పిల్లలను విడివిడిగా నిద్రించడానికి క్రమంగా ప్రయత్నించండి. ఈ సమయంలో పిల్లలు కొద్దిగా పెద్దవారు అవుతారు. కొద్దిగా విషయాలు అర్థమవ్వడం ప్రారంభమవుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి నిద్రించడం మానసిక అభివృద్ధిని ఆలస్యం చేస్తుంది. వారు బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోలేరు. ఇది భవిష్యత్తులో వారిని ప్రభావితం చేస్తుంది. ఈ కింది విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నిర్ణయం తీసుకోవడం, సామాజిక ఆందోళన, ఆశించడం, స్వతంత్ర ప్రవర్తన లేకపోవడం, మెమరీ నష్టం, తక్కువ శక్తి, అలసట, ఊబకాయం, భవిష్యత్తులో నిద్ర సమస్యలు, డిప్రెషన్ వంటివి వస్తాయి. అందుకే 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారితో నిద్రించడం మానేయాలి. పిల్లలకు కూడా ప్రైవెసీ ఇవ్వాలి. అప్పుడే వారు సొంతంగా ఆలోంచిచగలుగుతారు. స్వేచ్ఛతో ఉంటారు.

తదుపరి వ్యాసం