తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లలతో ఉదయాన్నే ఈ ఐదు పనులను చేయించండి.. ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలు

Parenting Tips: పిల్లలతో ఉదయాన్నే ఈ ఐదు పనులను చేయించండి.. ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలు

11 November 2024, 20:30 IST

google News
    • Parenting Tips: చిన్నప్పుడే పిల్లలకు కొన్ని అలవాట్లు చేయించడం వల్ల వారు దాన్ని కొనసాగిస్తారు. వారి జీవితంలో భాగం చేసుకుంటారు. తల్లిదండ్రులు అలా పిల్లలకు కొన్ని మంచి అలవాట్లు నేర్పాలి. ఉదయాన్నే పిల్లలతో పేరెంట్స్ చేయించాల్సిన 5 పనులు ఏవంటే..
Parenting Tips: పిల్లలతో ఉదయాన్నే ఈ ఐదు పనులను చేయించండి.. ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలు (Photo: Pexels)
Parenting Tips: పిల్లలతో ఉదయాన్నే ఈ ఐదు పనులను చేయించండి.. ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలు (Photo: Pexels)

Parenting Tips: పిల్లలతో ఉదయాన్నే ఈ ఐదు పనులను చేయించండి.. ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలు (Photo: Pexels)

పిల్లలు చాలా విషయాలను త్వరగా అలవాటు చేసుంటారు. అందుకే చిన్నతనంలోనే వారికి మంచి అలవాట్లను, పనులను తల్లిదండ్రులు నేర్పాలి. పిల్లల్లో శారీరకంగా, మానసికంగా వృద్ధి మెరుగ్గా ఉండాలంటే వారి ఆహారం, వారి అలవాట్లపై పూర్తి దృష్టి సారించాలి. వారికి ఆరోగ్యకరమైన అలవాట్లను తల్లిదండ్రులు నేర్పిస్తే జీవితాంతం వారు అవి పాటించే అవకాశం ఉంటుంది. పిల్లలు ఉదయాన్నే కొన్ని పనులు చేయడం వారి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులు ఉదయాన్నే పిల్లలకు నేర్పాల్సిన అలవాట్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

మేల్కొనేందుకు నిర్దిష్టమైన సమయం

పిల్లలు దాదాపు ప్రతీ రోజు ఉదయం ఒకే సమయంలో నిద్ర మేల్కొనేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. రాత్రి త్వరగా నిద్రించి.. తెల్లవారుజామున మేల్కొనేలా నేర్పించాలి. ఉదయం మేల్కొనేందుకు ఓ టైమ్ ఫిక్స్ చేయాలి. వీలైనంత వరకు వారు అదే సమయానికి బెడ్ దిగేలా అలవాటు చేయాలి. దీనివల్ల ఆ టైమ్‍కు వారి శరీరం అడ్జస్ట్ అవతుంది. ఒక షెడ్యూల్ పాటిస్తే పిల్లలకు నాణ్యమైన నిద్ర పడుతుంది. దీనివల్ల పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్రమశిక్షణ కూడా అలవరుతుంది.

పరగడుపున గోరువెచ్చటి నీరు

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయేందుకు ఇది సహకరిస్తుంది. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. అందుకే ఉదయాన్నే పిల్లలు గోరువెచ్చని నీరు తాగేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. ఈ నీరు తాగడం వల్ల మానసికంగానూ ప్రశాంతంగా అనిపిస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం చిన్నతనంలోనే అలవాటు చేస్తే.. వయసు పెరిగినా దాన్ని పిల్లలు కొనసాగించే అవకాశం ఉంటుంది.

యోగా, వ్యాయామం చేసేలా..

ఉదయాన్నే ధ్యానం, యోగా, వ్యాయామాలు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అందుకే ఉదయాన్నే వీటని చేసేలా పిల్లలకు అలవాటు చేయాలి. వ్యాయామాలు, యోగా చేయడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీంతో వారి ఏకాగ్రత పెరుగుతుంది. చదువులోను బాగా రాణించేందుకు ఉపయోగపడుతుంది. శారీరంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. చిన్నతనంలోనే వీటిని అలవాటు చేస్తే.. తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు.

లిస్ట్ సిద్ధం చేయించాలి

ఆ రోజంతా ఏఏ పనులు చేయాలో పిల్లలతో ఉదయాన్నే ఓ లిస్ట్ రాయించాలి. రోజును పూర్తిస్థాయిలో ఎలా సద్వినియోగం చేసుకోవాలో వారికి నేర్పించాలి. రోజంతా ఏం చేయాలనుకుంటున్నారో ఓ పేపర్‌పై రాయాలని పిల్లలకు చెప్పాలి. ప్రతీ రోజు ఈ లిస్ట్ తయారు చేయించాలి. దీనివల్ల వారికి క్రమశిక్షణ అలవడటంతో పాటు సమయం విలువ అర్థమవుతుంది. దీనివల్ల వారిలో మేనేజ్‍మెంట్ స్కిల్స్ పెరుగుతాయి.

ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్

ఉదయాన్నే ఆరోగ్యకమైన బ్రేక్‍ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. రోజంతటి ఎనర్జీపై దీని ప్రభావం ఉంటుంది. ఉదయాన్నే ఆరోగ్యమైన ఆహారం తినేలా పిల్లలకు నేర్పాలి. ఉదయం కూరగాయలు, పండ్లు, డ్రైప్రూట్స్ కూడా తినేలా చేయాలి. ముఖ్యంగా కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో వివరించి వాటిని తినేలా చేయాలి. ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం వల్ల పోషకాలు బాగా అంది వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వారికి అలవాటు అవుతుంది.

తదుపరి వ్యాసం