క్యాలరీలు తక్కువగా ఉండే 5 రకాల కూరగాయలు.. వెయిట్ లాస్‍కు తోడ్పడతాయి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 21, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తమ ఆహారంలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తాయి. అలా క్యాలరీలు తక్కువగా ఉండే 5 రకాల కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పొటాషియమ్, ఫోలెట్, విటమిన్ సీ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేందుకు ముల్లంగి తోడ్పడుతుంది. 

Photo: Pexels

కీరదోసలో క్యాలరీలు అత్యల్పంగా ఉంటాయి. వాటర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ డైట్‍లో కీరదోసను తీసుకుంటే వెయిట్‍లాస్‍కు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

క్యాబేజీలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు క్యాబేజీని కూడా ఆహారంలో తీసుకోవడం తోడ్పడుతుంది. 

Photo: Pexels

పాలకూర, కేల్‍లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ సీ, విటమిన్ కే, మ్యాగనీస్ సహా చాలా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వెయిట్ లాస్‍కు పాలకూర, కేల్ ఉపయోగపడతాయి

Photo: Pexels

క్యారెట్లలో కూడా క్యాలరీలు తక్కువ మోతాదులోనే ఉంటాయి. చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గేందుకు క్యారెట్ సాయపడుతుంది.

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels