Paneer Gongura Curry: పాలక్ పనీర్‌లాగే పనీర్ గోంగూర కర్రీ వండి చూడండి, పుల్లగా అదిరిపోతుంది
22 May 2024, 11:30 IST
- Paneer Gongura Curry: పాలక్ పనీర్ కర్రీ అందరికీ తెలిసిందే. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే పనీర్ గోంగూర కర్రీ పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు.
పనీర్ కర్రీ రెసిపీ
Paneer Gongura Curry: పాలక్ పనీర్ అనగానే ఎంతోమంది చెవి కోసుకుంటారు. కేవలం పాలకూర పనీర్ కాంబినేషన్ మాత్రమే కాదు, పనీర్ గోంగూర కాంబినేషన్ కూడా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో పుల్ల పుల్లని పనీర్ గోంగూర కర్రీని వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. దీంతో చపాతీ తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. పాలక్ పనీర్‌లాగే, పనీర్ గోంగూర వండొచ్.చు
పనీర్ గోంగూర కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ క్యూబ్స్ - 100 గ్రాములు
ఉల్లిపాయలు - రెండు
నెయ్యి- ఒక స్పూను
గోంగూర - నాలుగు కట్టలు
పచ్చిమిర్చి - ఐదు
ఉప్పు - రుచికి సరిపడా
లవంగాలు - నాలుగు
కారం - ఒక స్పూను
యాలకులు - ఆరు
నూనె - తగినంత
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పనీర్ గోంగూర కర్రీ రెసిపి
1. గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి అర గ్లాసు నీళ్లు వేయాలి.
3. అందులోనే శుభ్రంగా కడిగిన గోంగూరను వేసి ఉడకబెట్టాలి.
4. అది మెత్తగా ఇగురులాగా, దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకొని స్టవ్ కట్టేసి చల్లార్చాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
6. ఆ నెయ్యిలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు, లవంగాలు వేసి బంగారం రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
7. వాటిని కూడా చల్లార్చాలి. వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
8. ఆ తర్వాత గోంగూరని కూడా వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి నూనె వేయాలి.
10. అందులో కరివేపాకులు వేసి వేయించాలి.
11. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని వేయాలి.
12. ఇది బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయాలి.
13. ఆ తర్వాత అందులో గోంగూర పేస్టును వేసి బాగా కలపాలి.
14. పసుపు, కారం, ఉప్పు వేసి అది ఇగురులాగా అయ్యే వరకు కలపాలి.
15. అందులోనే పనీర్ ముక్కలను వేసి చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.
16. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మళ్ళీ ఉడికించాలి.
17. అప్పుడు ఇగురులాగా వస్తుంది. అంతే పులపుల్లని పనీర్ గోంగూర రెడీ అయినట్టే. ఇది తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది.
ఎక్కువ అన్నంలో తక్కువ కూర కలుపుకోవడం ఈ పనీర్ గోంగూర కర్రీ వల్ల కుదురుతుంది. అలాగే రోటీ, చపాతీతో కూడా ఇది టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ఈ పులుపు వంటకం ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.
టాపిక్