తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Rice : పాలకూర రైస్.. చేయడం చాలా ఈజీ.. తింటే సూపర్ టేస్ట్

Palak Rice : పాలకూర రైస్.. చేయడం చాలా ఈజీ.. తింటే సూపర్ టేస్ట్

Anand Sai HT Telugu

21 April 2024, 11:00 IST

google News
    • Palak Rice Recipe : పాలకూర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనితో రైస్ చేసుకుని తినండి. చాలా రుచిగా ఉంటుంది.
పాలకూర రైస్
పాలకూర రైస్

పాలకూర రైస్

పాలకూరతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనిని ఎక్కువగా కర్రీ చేసుకుంటారు. కానీ అత్యవసర సమయాల్లో వేగంగా చేసుకునేందుకు పాలకూర రైస్ ట్రై చేయండి. ఇది కొత్త రుచిని మాత్రమే కాదు.. అనేక ఉపయోగాలను కూడా ఇస్తుంది. అందుకే దీనిని కచ్చితంగా తినాలి. తయారు చేయడానికి సమయం కూడా ఎక్కువగా పట్టదు.

పోషక విలువలున్న పాలకూర అందరికీ సుపరిచితమే. ఇది తీసుకోవడం రుచికే కాదు ఆరోగ్యానికే కూడా మంచిది. ఈ పాలకూరను ఉపయోగించి చాలా వంటకాలు చేసుకోవచ్చు. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్న పాలకూర పిల్లలకు చాలా అవసరం. పెద్దలు కూడా దీనిని ఎక్కువగా తినాలి. అయితే చాలా మంది పిల్లలు పాలకూర అనగానే తినరు. అందుకోసం దీనితో రైస్ ట్రై చేయండి.

పాలకూర ఆకుకూరలను ఉపయోగించి పిల్లలకి ఇష్టపడేలా వంటకం ఎలా చేయాలని అనుకుంటున్నారా? ఈజీగా తయారుచేసే రెసిపీ ఉంది. పాలకూర రైస్ చేయడం సులభం, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. ఈ రైస్‌ను అల్పాహారంగా తీసుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నంపూట కూడా తినవచ్చు. పాలకూర అన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం..

పాలకూర రైస్‌కు కావాల్సిన పదార్థాలు

2 కప్పుల బియ్యం, 1 కప్పు కడిగి, తరిగిన పాలకూర, 1 పెద్ద ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, 1/2 లవంగం, 3 ఎండుమిర్చి, 1 tsp ఆవాలు, 1 tsp జీలకర్ర, లవంగాలు కొన్ని, 1/2 కప్పు జీడిపప్పు, ఉప్పు, నూనె, ఒక నిమ్మకాయ

పాలకూర రైస్‌ తయారీ విధానం

బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగిన పాలకూర వేసి వేయించాలి.

దానికి 1/2 కప్పు నీళ్లు పోసి మరిగే వరకు తక్కువ మంట మీద ఉంచాలి.

ఇప్పుడు లవంగాలు, ఎండుమిర్చి, జీడిపప్పులను మెత్తగా గ్రైండ్ చేసి వేరే పాన్‌లో నూనె వేసి వేయించాలి.

పాలకూర మిశ్రమంతో రుబ్బిన మిశ్రమాన్ని కలపండి. ఉప్పు వేసి బాగా కలపాలి, తర్వాత చల్లారనివ్వాలి.

ఈ పాలకూర మిశ్రమంలో అన్నం మిక్స్ చేసి, దానిపై నిమ్మరసం పిండాలి. బాగా కలపాలి. ఇప్పుడు రుచికరమైన పాలకూర రైస్ తినడానికి సిద్ధమైనట్టే.

పాలకూర ప్రయోజనాలు

పాలకూర ఆకులలో ఒక కప్పుకు 250 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది మీ దంతాలతో సహా మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం మీ జీవక్రియను పెంచుతుంది. మీ గుండె లయను నియంత్రిస్తుంది. రక్తపోటును నిర్వహిస్తుంది. పాలకూర మెగ్నీషియం యొక్క గొప్ప మూలం. ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

శరీర శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీ శరీరానికి ఇనుము అవసరం. ఐరన్ కంటెంట్ ఉత్తమంగా పొందడానికి, మీరు బచ్చలికూరతో సిట్రస్ పండ్ల వంటి కొన్ని విటమిన్ సి ఆహారాలను జోడించవచ్చు. ఇది ఐరన్ కంటెంట్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇలా పాలకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం