తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo Reno 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల, రూ. 4 వేల వరకు డిస్కౌంట్!

Oppo Reno 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల, రూ. 4 వేల వరకు డిస్కౌంట్!

HT Telugu Desk HT Telugu

19 July 2022, 15:29 IST

    • ఒప్పో నుంచి తాజాగా విడుదలైన Reno8, Reno8 Pro స్మార్ట్‌ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్కౌంట్లు ఏమున్నాయి? తదితర విషయాలు ఇక్కడ చూడండి.
Oppo Reno8 Pro
Oppo Reno8 Pro

Oppo Reno8 Pro

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత మార్కెట్‌లో తాజాగా రెనో 8 స్మార్ట్‌ఫోన్ సిరీస్, ప్యాడ్ ఎయిర్ అలాగే ఎన్‌కో X2 TWS ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. ఒప్పో రెనో 8 సిరీస్‌లో Reno8, Reno8 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా 5G మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లు. మొదటి మోడల్ Oppo Reno 8 నైట్ టూర్ బ్లాక్, క్లియర్ స్కై బ్లూ, స్లైట్లీ డ్రంక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ మోడల్‌ ధర రూ. 29,999/- నుంచి ప్రారంభమవుతుండగా.. మరొక మోడల్ Reno 8 Pro ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఎన్‌కౌంటర్ బ్లూ, నైట్ టూర్ బ్లాక్, స్లైట్లీ డ్రంక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మరి ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, కాన్ఫిగరేషన్ పరంగా ఎన్ని వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. వాటి ధరలెంత మొదలగు సమాచారాన్ని ఈ కింద పేర్కొన్నాం.

Oppo Reno 8 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 12 GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • Mediatek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఫాస్ట్ ఛార్జర్

రెనో 8 జూలై 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్ అలాగే ఇతర మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.

Oppo Reno 8ను HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే వినియోగదారులకు ఫ్లాట్ 10% తక్షణ తగ్గింపును రూ. 3,000 వరకు పొందవచ్చు.

Oppo Reno 8 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే

12 GB RAM, 256GB స్టోరేజ్ సామర్థ్యం

Mediatek డైమెన్సిటీ 8100 Max ప్రాసెసర్

వెనకవైపు 50 MP +8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

4K అల్ట్రా నైట్ మోడ్ వీడియో

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఫాస్ట్ ఛార్జర్

రెనో 8 ప్రో జూలై 19 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్ అలాగే ఇతర మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.

Oppo Reno 8 Proను ICICI బ్యాంక్, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే వినియోగదారులకు ఫ్లాట్ 10% తక్షణ తగ్గింపును రూ. 4,000 వరకు పొందవచ్చు.

టాపిక్