తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iqoo 9t 5g । బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ లాంటి డిజైన్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

iQOO 9T 5G । బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ లాంటి డిజైన్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu

17 July 2022, 15:29 IST

    • వివో మొబైల్స్ సబ్ బ్రాండ్ iQOO నుంచి 9 సిరీస్‌లో మరొక ఫ్లాగ్ షిప్ 5G స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. ఇందులో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
iQoo 9T 5G
iQoo 9T 5G

iQoo 9T 5G

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO తాజాగా తమ బ్రాండ్ నుంచి 9 సిరీస్‌లో మరొక సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లిస్టింగ్ చేసింది. ఈ ఫోన్ ఈ నెలలోనే భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రదర్శిస్తోంది. ఈ ఫోన్ BMW మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్ పై నీలం, నలుపు, ఎరుపు రంగుల చారల లైనింగ్ ఇచ్చారు. అంతేకాకుండా Vivo ఫోన్లలో ఉండేటువంటి V1+ ఇమేజింగ్ చిప్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి లీక్స్ కొనసాగుతున్నాయి. iQoo 9T 5G ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్, ఇంకా 40x డిజిటల్ జూమ్‌తో వస్తుంది. Samsungలోని GN5 ప్రైమరీ సెన్సార్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ ఫోన్‌లో గేమింగ్ ఫీచర్లను సపోర్ట్ చేసే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC) కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

iQoo 9T 5G లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉండవచ్చు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED E5 డిస్‌ప్లే
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్
  • Samsung GN5 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా
  • రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్ సపోర్ట్‌తో కెమెరా
  • స్మార్ట్‌ఫోన్ Vivo నుంచి V1+ ఇమేజింగ్ చిప్‌
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ ఫీచర్లు తెలిశాయి. ఈ ప్రకారం ఇది ఫ్లాగ్ షిప్ ఫోన్ అని అర్థం అవుతుంది. దీని ధర, ఇతర వివరాలు తెలియాలంటే జూలై చివరి వరకు ఆగాలి.

టాపిక్

తదుపరి వ్యాసం