Nokia G21 స్మార్ట్‌ఫోన్.. 3 రోజుల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు!
27 April 2022, 14:47 IST
- ఇకప్పటి ఐకాన్ ఫోన్ బ్రాండ్ నోకియా నుంచి Nokia G21 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. దీనితో పాటు మరో రెండు ఫీచర్ ఫోన్లను, ఇయర్ బడ్లను కంపెనీ విడుదల చేసింది.
Nokia G21 Smartphone
నోకియా ఫోన్‌ల తయారీదారు HMD గ్లోబల్ తాజాగా 'Nokia G21' పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ ఆధారంగా 4GB లేదా 6GB రెండు వేరియంట్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మరి ఈ సరికొత్త Nokia G21లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Nokia G21 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
4GB/6GB RAM, 64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్
వెనకవైపు 50 మెగా పిక్సెల్ +2MP + 2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
4GB RAM +64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999/-
రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.14,499/-
ఈ స్మార్ట్‌ఫోన్ డస్క్, నార్డిక్ బ్లూ.అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.
Nokia G21తో పాటు, కంపెనీ రెండు కొత్తగా Nokia 105, Nokia 105 Plus అనే ఫీచర్ ఫోన్‌లను అలాగే Nokia Comfort Earbudsలను విడుదల చేసింది.