స్మార్ట్‌ఫోన్ నోకియా XR20 స్పెసిఫికేషన్లు, ధర చూడండి!
28 February 2022, 16:35 IST
- నోకియా XR20 స్మార్ట్‌ఫోన్ మనకు ఒకప్పటి పాత అనుభవాలను గుర్తుకు తెస్తుంది. ఇది ఇప్పుడొచ్చే ఇతర స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా సనన్ని సొగసైన డిజైన్, కెమెరా అని చెప్పుకునే ఫీచర్స్ కాకుండా ఎలాంటి దెబ్బలనైనా తట్టుకునేలా దృఢమైన, కఠినమైన డిజైన్‌తో వచ్చింది.
Nokia XR20
నోకియా అంటే మనకు ఒకప్పటి బండలాంటి దృఢమైన సెల్ ఫోన్లే గుర్తుకొస్తాయి. ఇప్పుడు HMD గ్లోబల్- Nokia స్మార్ట్‌ఫోన్లు కూడా దృఢత్వంపైనే దృష్టిపెట్టాయి. కొత్తగా విడుదలైన నోకియా XR20 స్మార్ట్‌ఫోన్ మనకు అలనాటి అనుభవాలనే గుర్తుకు తెస్తుంది. ఇది ఇప్పుడొచ్చే ఇతర స్మార్ట్‌ఫోన్ల లాగా సనన్ని సొగసైన డిజైన్, కెమెరా అని చెప్పుకునే ఫీచర్స్ కాకుండా ఎలాంటి దెబ్బలనైనా తట్టుకునేలా, కఠినమైన డిజైన్‌తో వచ్చింది. ఈ ఫోన్ బాడీ రబ్బరుతో తయారైన ప్రొటెక్షన్ బంపర్‌ను కలిగిఉండటమే కాకుండా డిస్‌ప్లేపై కఠినమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్‌తో ఇచ్చారు.
వాటర్ రెసిస్టెంట్..
ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP68 రేటింగ్ కూడా ఉంది. అంటే నోకియా XR20 స్మార్ట్‌ఫోన్ పైనుంచి కిందపడినా, కుదుపులకు గురైనా, ఎలాంటి ఉష్ణోగ్రతా వైవిధ్యాలకు లోనైనా, చక్కగా పనిచేస్తుంది. 3 అడుగుల నీటిలోపల వరకు వాటర్ రెసిస్టెంట్ అందిస్తుంది.
మిగతా స్పెసిఫికేషన్ల వివరాలకు వస్తే, XR20 స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్‌ప్లే FHDతో 1080 x 2400 రిజల్యూషన్ ఉంది, డిస్‌ప్లే ఎగువ అంచున పిన్‌హోల్ కెమెరా ఉంది, దిగువన టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, డౌన్‌వర్డ్-ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి.
కెమెరా సెటప్
వెనుకవైపు 48MP మరియు 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్ లతో కూడిన రెండు కెమెరాలు ఉన్నాయి, ముందువైపున 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 6GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో 512GB వరకు స్టోరేజీ పెంచుకునే అవకాశం ఉంది.
బ్యాటరీ, ధర
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4630 mAh, నాన్- రిమూవెబుల్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు లైఫ్ ఉంటుందని చెబుతున్నారు. 4.0 క్విక్ ఛార్జీ టెక్నాలజీ కలిగిన 18W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు.
అయితే అన్నీ బాగానే ఉన్నా ఈ ఫోన్ హెవీ డ్యూటీ మల్టీ టాస్కింగ్ కోసం ఉద్దేశించింది కాదు. Nokia XR20 మన్నికను కోరుకునే వారి కోసం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దీని ధర రూ. రూ. 46,999/- గా నిర్ణయించారు.
టాపిక్