తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Nut November: మగవారి ఆరోగ్యం కోసమే నో నట్ నవంబర్, ఈ నెల అంతా అబ్బాయిలు ఆ పని చేయకూడదు

No Nut November: మగవారి ఆరోగ్యం కోసమే నో నట్ నవంబర్, ఈ నెల అంతా అబ్బాయిలు ఆ పని చేయకూడదు

Haritha Chappa HT Telugu

01 November 2024, 12:57 IST

google News
    • No Nut November: నో నట్ నవంబర్‌ను షార్ట్‌కట్‌లో NNN అని కూడా పిలుస్తారు.  నవంబర్ నెలలో మగవారు కొన్ని లైంగిక పనులకు దూరంగా ఉండాలని చెప్పడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం.
నో నట్ నవంబర్ అంటే ఏమిటి?
నో నట్ నవంబర్ అంటే ఏమిటి? (Pixabay)

నో నట్ నవంబర్ అంటే ఏమిటి?

నో నట్ నవంబర్... ఈ పేరు వినగానే కాస్త నవ్వు రావచ్చు, కానీ దీని ప్రధాన ఉద్దేశం మాత్రం పురుషుల ఆరోగ్యానికి సంబంధించినది. వారి లైంగిక ఆరోగ్యం చక్కగా ఉంటేనే వారు సంతృప్తిగా, చురుగ్గా జీవించగలరు. అందుకే నవంబర్ నెల మొత్తం వారు హస్తప్రయోగానికి దూరంగా ఉండాలని చెబుతూ ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అశ్లీల చిత్రాలు చూడకూడదని కూడా ఈ ప్రత్యేక దినోత్సవం చెబుతోంది. వాటి కారణంగానే మగవారిలో హస్తప్రయోగం అధికమవుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి.

నో నట్ నవంబర్ అనేది ఆధునిక కాలంలో పుట్టిన ప్రత్యేక దినోత్సవం. రెడిట్‌లో దీనిపై పెద్ద కమ్యూనిటీ నడుస్తోంది. అందులో ఉన్న సబ్‌స్క్రైబర్లు నో నట్ నవంబర్ దినోత్సవాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. ప్రతి నవంబర్లో పురుషులు తమ ఆరోగ్యం కోసం పూర్తిగా హస్త ప్రయోగానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

నో నట్ నవంబర్ ఎప్పుడు ప్రారంభమైంది?

తొలిసారి ఈ ప్రత్యేక దినోత్సవం పేరు 2011లో అర్బన్ డిక్షనరీలో కనిపించింది. ఆ తర్వాత 2017లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ ఆధునిక భావన కొంతమందిని ఆకర్షించడంతో రెడిట్‌లో ఒక కమ్యూనిటీ ఏర్పడింది. ఆ కమ్యూనిటీకి ప్రతి ఏడాది సబ్‌స్క్రైబర్లు పెరుగుతూ వస్తున్నారు.

దీన్ని ఎందుకు నిర్వహించుకుంటారు?

పురుషులు వీర్యం నిలుపుకోగలరో లేదో చూడటానికి నో నట్ నవంబర్ అనే సవాలు ఎదురవుతుంది. కొందరు వ్యక్తులు దాన్ని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆ సవాలును స్వీకరిస్తారు. ఈ పని వల్ల పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని కూడా ఫలితాలు చూపించాయి. ఈ నెల అంతా అశ్లీల చిత్రాలకు, లైంగిక ప్రక్రియకు, హస్త ప్రయోగానికి దూరంగా ఉండటమే ప్రధాన ఉద్దేశం. ఇలా ఒక నెల పాటు స్కలనం కాకుండా ఆపుకోవడం వల్ల మగవారిలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.

ఎన్నో ఉపయోగాలు

నెల పాటూ స్కలనం కాకుండా చూసుకోవడం వల్ల కండరాల్లో పెరుగుదల, వారి శక్తి స్థాయిలు పెరగడం, జుట్టు ఒత్తుగా పెరగడం, స్పెర్మ్ నాణ్యత మెరుగవ్వడం, ఒత్తిడి తగ్గడం, మానసిక ఆందోళనలను రాకపోవడం, ఏకాగ్రత పెరగడం, వారిలో స్వీయ నియంత్రణ కూడా మెరుగవ్వడం, అంగస్తంభన వంటి సమస్యలు రాకపోవడం వంటి మంచి ఫలితాలు కనిపించాయి. కాబట్టి పురుషులు నో నట్ నవంబర్ సవాలను స్వీకరించడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మేలే జరుగుతుంది.

హస్త ప్రయోగానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పడమే నో నట్ నవంబర్. ఇప్పటి యువత పోర్న్ వీడియోలకి బానిసలుగా మారి హస్తప్రయోగానికి అలవాటు పడుతున్నారు. ఇది వారి వీర్య ఉత్పత్తి పైనా, నాణ్యత పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే వారిలో సెక్స్ పరమైన విపరీతమైన కోరికలను పెంచుతుంది. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా చెడే చేస్తుంది. కాబట్టి నో నట్ నవంబర్‌ను పురుషులు సవాలుగా స్వీకరించి లైంగిక ప్రక్రియకు, హస్తప్రయోగానికి దూరంగా ఉండి స్కలనం కాకుండా నిలుపుకునేందుకు ప్రయత్నించాలి.

తదుపరి వ్యాసం