తెలుగు న్యూస్  /  Lifestyle  /  Nirjala Ekadashi 2022 Rituals And Significs And History Of This Holy Day

Nirjala Ekadashi 2022 : ఏకాదశులందు నిర్జల ఏకాదశి తీరే వేరు..

10 June 2022, 6:21 IST

    • ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. కానీ నిర్జల ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి ఈరోజుకు ఎందుకు ఆ స్థానం ప్రత్యేకం. పూజా సమయాలు ఏంటి.. పూజ ఎలా చేయాలి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిర్జల ఏకాదశి వ్రతం
నిర్జల ఏకాదశి వ్రతం

నిర్జల ఏకాదశి వ్రతం

Nirjala Ekadashi 2022 | విష్ణువును పూజించే వారికి ఏకాదశి తిథిలు, సమయాలు చాలా ముఖ్యమైనవి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏకాదశి అనేది శుక్ల పక్షం, కృష్ణ పక్షం అనే రెండు చంద్ర దశలలో పదకొండవ చంద్ర రోజున వస్తుంది. అందుకే, హిందూ క్యాలెండర్ నెలలో రెండు ఏకాదశి రోజులు ఉంటాయి. భక్తులు చాలా మంది ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తారు.

ఏకాదశి రోజున, భక్తులు కఠినమైన ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. భక్తులు నీరు లేకుండా లేదా కేవలం నీటితో లేదా కేవలం పండ్లతో ఉపవాసం పాటిస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం.. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు దుష్ప్రభావాల నుంచి బయటపడుతారని భక్తులు విశ్వసిస్తారు. ఆయురారుగ్యాలతో.. పూర్తి ఆనందం పొందుతారని నమ్ముతారు. భగవంతుని గురించి ఆలోచించడానికి, మోక్షాన్ని పొందేందుకు, మానసిక ప్రశాంతత కోసం ఏకాదశి వ్రతం చేస్తారు.

నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి వత్రాన్ని ఆచరించే వారు.. ఆ సంవత్సరంలోని 24 ఏకాదశులను ఆచరించినంత ఫలితం పొందుతారని భక్తులు నమ్ముతారు. అందుకే చాలా నిష్టగా ఉపవాసం చేస్తారు. పచ్చి మంచి నీరు కూడా తీసుకోకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేసేవారు ఉన్నారు. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు. దాన ధర్మాలు చేసి.. వ్రతాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి మీ శక్తి మేరకు దానాలు చేయండి.

భీమసేన ఏకాదశి అనే పేరు..

నెలలో పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. అయితే నిర్జల ఏకాదశి ఎందుకు ప్రత్యేకమో తెలుసా? ఓ రోజు భీముడు వ్యాసుడితో ఈ ఏకాదశి వ్రతాల గురించి ఇలా చర్చించాడు. నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా చేయగలను అని భీముడు వ్యాసుడిని అడగగా... నువ్వు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు.. అన్ని ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందని వ్యాసుడు భీముడికి సూచించాడు. అందుకే నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అంచారు.

పూజా మంత్రం..

విష్ణు మంత్రం.. ఓం నమో భగవతే వాసుదేవాయా..

కృష్ణ మహా మంత్రం... హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

పూజా సమయం..

నిర్జల ఏకాదశి జూన్ 10 వ తేది శుక్రవారం రోజు వస్తుంది. అనగా నేడు ఉదయం 7.25 నుంచి.. రేపు అనగా జూన్ 11 వ తేదీన శనివారం ఉదయం 5.45కు ముగుస్తుంది.

టాపిక్