తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhishma Ekadashi| భ‌క్తిభావాన్ని పంచిన విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ‌ పారాయణం

Bhishma Ekadashi| భ‌క్తిభావాన్ని పంచిన విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ‌ పారాయణం

HT Telugu Desk HT Telugu

12 February 2022, 12:43 IST

google News
    • టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం జరిగింది. ప్రత్యక్షంగా పలువురు భక్తులు పాల్గొంటే, టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ద్వారా పరోక్షంగా లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విష్ణు సహస్ర అఖండ పారాయణం
విష్ణు సహస్ర అఖండ పారాయణం (Feed)

విష్ణు సహస్ర అఖండ పారాయణం

భీష్మ ఏకాదశి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని లోక‌క‌ల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై శ‌నివారం ఉద‌యం టిటిడి చేప‌ట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ‌ పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ప‌లువురు భ‌క్తులు నేరుగా పాల్గొన‌గా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌మ ఇళ్లలోనే పారాయ‌ణం చేశారు. వేదిక మీద‌ పెద్ద శేష వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, ప‌క్క‌న‌ శ్రీ భీష్మాచార్యుల ప్ర‌తిమ‌ను కొలువు దీర్చి మంగ‌ళ‌హార‌తి స‌మ‌ర్పించారు. ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మొద‌టి, రెండు, మూడ‌వ ప‌ర్యాయాలు ప‌ఠించ‌డం వ‌ల‌న విశేష ఫ‌లితాలు ల‌భిస్తాయ‌ని వేదాల్లో చెప్పిన‌ట్లు తెలిపారు. మ‌న జీవ‌తంలో ధ‌ర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శ‌క్తి స‌రిపోద‌ని, దీనిని సుల‌భంగా తెలుసుకునేందుకు శ్రీ విష్ణుసహస్రనామాన్ని శ్రీ భీష్మాచార్యులు శ్రీ ధ‌ర్మ‌రాజుకు వివ‌రించ‌గా శ్రీ మ‌హావిష్ణువు ఆమోదించార‌న్నారు. కావున ఎవ‌రైతే విష్ణుసహస్రనామాన్ని పారాయ‌ణం చేస్తారో వాళ్ళు భ‌గ‌వంతుడి స‌న్నిధికి చేరుతార‌ని వివ‌రించారు.

<p>పాల్గొన్న భక్తులు&nbsp;</p>

ముందుగా వేద సంస్కృత పండితులు శ్రీ శేషాచార్యులు. శ్రీ కుప్పా న‌ర‌సింహం, డా. టి. బ్రహ్మచార్యులు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలియ‌జేసి, సంకల్పం చెప్పారు. ఆ త‌రువాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు పారాయ‌ణం చేశారు. అనంత‌రం విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు, ఉత్తరపీఠికలోని 34 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ నాగరాజన్ బృందం చేసిన నారాయణ నామ సంకీర్తనం భ‌క్తుల‌ను భ‌క్తిసాగ‌రంలో ముంచెత్తింది.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలోని సుమారు 200 మంది వేదపండితులు, విశేష సంఖ్య‌లో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌క‌ల్యాణం కోసం 2020 ఏప్రిల్ నుండి టిటిడి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో యోగవాసిష్ఠం, ధన్వంతరి మహామంత్ర పారాయణం, సుందరకాండ పఠనం, వేదపారాయణం, విరాటపర్వం, శ్రీమద్భగవద్గీత, షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష, కార్తీక మాసోత్సవం, ధనుర్మాసోత్సవం, మాఘ మాసోత్సవం, బాల కాండ పారాయ‌ణం త‌దిత‌ర విశేష కార్యక్రమాలను రూపొందించి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. త‌ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌న రంగ‌చార్యులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

<p>భీష్మ ఏకాదశి&nbsp;</p>
తదుపరి వ్యాసం