తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Keema Dum Curry: మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది

Mutton Keema Dum Curry: మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

16 February 2024, 15:52 IST

google News
    • Mutton Keema Dum Curry: మటన్ ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మటన్ కీమా దమ్ కర్రీ చేసుకొని చూడండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులువు.
మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ
మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ (youtube)

మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ

Mutton Keema Dum Curry: నాన్ వెజ్ ప్రియులకు కీమా కర్రీలు అంటే ఇష్టంగా ఉంటుంది. చికెన్ కీమా, మటన్ కీమా, ఎగ్ కీమా .... ఇవన్నీ వారు ఇష్టంగా తింటారు. ఇక్కడ మేము మటన్ కీమా ధమ్ కర్రీ ఎలా చేయాలో చెబుతున్నాం. దీని రెసిపీ చాలా సులువు. ఇది చేసుకుంటే అన్నంలోకి, చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ ఎలాగో ఒకసారి తెలుసుకోండి.

మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ కీమా - అర కిలో

ఉల్లిపాయలు - రెండు

నెయ్యి - పావు కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

లవంగాలు - ఆరు

యాలకులు - ఆరు

జీలకర్ర - ఒక స్పూన్

దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క

జాపత్రి - అర స్పూను

జాజికాయ - చిన్న ముక్క

మిరియాలు - నాలుగు ముప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

బొగ్గు ముక్క - ఒకటి

మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ

1. మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

3. ఆ నెయ్యిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి. అవి బ్రౌన్ రంగుకు వచ్చేవరకు వేయించుకోవాలి.

4. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఆ ఉల్లిపాయలు వేపుడు చల్లారాక మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి లవంగాలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, మిరియాలు వేసి వేయించాలి.

7. వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.

8. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయాలి.

9. ఆ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి.

10. శుభ్రంగా కడిగిన మటన్ కీమాను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

11. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని కీమా మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

12. ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను కూడా కీమా మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

13. దీన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

14. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

15. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

16. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.

17. ఇప్పుడు దీనికి స్మోకీ ఫ్లేవర్ తెచ్చేందుకు ఒక చిన్న గిన్నెలో కాల్చిన బొగ్గు ముక్కను వేయాలి.

18. ఆ గిన్నెను మటన్ కీమా కర్రీ మధ్యలో పెట్టాలి.

19. ఆ బొగ్గు ముక్కపై ఒక అర స్పూన్ నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేయాలి. దీనివల్ల కూరకు స్మోకీ ఫ్లేవర్ చేరుతుంది.

20. తర్వాత ఆ బొగ్గు ఉన్న గిన్నెను తీసి బయట పెట్టేయాలి. అంతే మటన్ కీమా దమ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

వేడివేడి అన్నంలో ఈ కూరను కలుపుకుని తింటే అదిరిపోతుంది. చపాతీ, రోటీతో కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే పూరితో తిన్నా బాగుంటుంది. ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మటన్ మితంగా తినడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈ మటన్ కర్రీలో మనం అవసరమైన మసాలాలను జోడించాము, కాబట్టి మసాలాలన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒకసారి ఈ మటన్ కీమా దమ్ కర్రీని చేసుకుని చూడండి. మీకే రుచి నచ్చుతుంది. ఇంకోసారి మీరే ఇష్టంగా చేసుకొని తింటారు.

టాపిక్

తదుపరి వ్యాసం