తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Care For Children । వర్షాకాలంలో మీ పిల్లలు జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి!

Monsoon Care for Children । వర్షాకాలంలో మీ పిల్లలు జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu

23 June 2023, 11:22 IST

google News
    • Monsoon Care for Children:  వర్షాకాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం, భద్రత, వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇక్కడ కొన్ని చిట్కాలను చూడండి. 
Monsoon Care for Children
Monsoon Care for Children (istock)

Monsoon Care for Children

Monsoon Care for Children: వర్షాకాలం ప్రారంభమైనందున, ఈ సీజన్ మొత్తం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం, భద్రత, వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు వారి ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. గాలిలో పెరిగిన తేమ, బాక్టీరియా, వైరస్, ఇతర హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుతాయి. అదనంగా, నీటి కుంటలు, వరద ప్రాంతాలలో నిలిచిపోయిన నీరు వ్యాధి-వాహక దోమలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అయితే, మీకు ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాము. వీటిని అనుసరించడం ద్వారా ఈ వర్షాకాలంలో మీరు మీ చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు, వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు, అప్పుడు మీరు వర్షాకాలం సోయగాన్ని ఆస్వాదించవచ్చు.

పరిశుభ్రతను పాటించండి

ఈ వర్షాకాలంలో మీరు మొట్టమొదటగా గుర్తుంచుకోవాల్సిన అంశం పరిశుభ్రతను పాటించండం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, మీ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి, తాజాగా వండిన ఆహారాన్ని తినండి. ఈ వాతావరణంలో క్రిములు, హానికర సూక్ష్మజీవులు విజృంభిస్తాయి. కాబట్టి మీ పిల్లలకు తరచుగా చేతులు కడుక్కోవడం నేర్పండి. భోజనం చేసేటపుడు, ఎప్పుడైనా చేతులు శుభ్రంగా ఉండాలి.

దోమల నుంచి రక్షణ

వర్షాకాలం తరచుగా దోమల జనాభాలో పెరుగుదలను తెస్తుంది, ఇది దోమల వలన కలిగే వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది. మీ ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్‌లు, ప్లగ్-ఇన్ పరికరాల సహయంతో దోమలు కుట్టకుండా జాగ్రత్తపడండి. మీ పిల్లలకు పొడవాటి చేతుల దుస్తులు, ప్యాంటులను ధరింపజేసి వారిని రక్షించండి.

నీరు నిలిచిన ప్రాంతాలలో అప్రమత్తం

నీరు నిలిచిన ప్రాంతాలు వివిధ రకాల ప్రమాదాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు కారకం అవుతాయి. నిలిచిన నీటిలో ఆడకుండా మీ పిల్లలను ప్రోత్సహించండి. ఓపెన్ డ్రెయిన్‌లు, మ్యాన్ హోల్స్, కరెంటు స్తంభాలు మొదలైన ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. కాబట్టి, అలాంటి ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండేలా మీ పిల్లలను హెచ్చరించండి.

వర్షంలో పిల్లలు తడవకుండా చర్యలు

వర్షాకాలంలో మీ పిల్లలు బయటకు వెళ్లినపుడు తడవకుండా వారికి వాటర్ ప్రూవ్ దుస్తులు, తలపై టోపీ, గొడుగు అందించండి. జారే ఉపరితలాలు ప్రబలంగా ఉంటాయి, కాబట్టి పిల్లలను తగిన పాదరక్షలతో సన్నద్ధం చేయడం చాలా అవసరం. బురదలో జారిపడకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌ను అందించే నాన్-స్లిప్ బూట్లు లేదా రెయిన్ బూట్లను సమకూర్చండి.

అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటం ముఖ్యం. ఇంట్లో ప్రథమ చికిత్స కిట్, టార్చ్ లైట్, అదనపు బ్యాటరీలు, తగినంత నిల్వ చేసే ఆహారం, తాగునీరు వంటి అవసరమైన వాటిని స్టాక్ తెచ్చిపెట్టుకోండి. అత్యవసర సేవలను సంప్రదించడం మొదలైన విధానాల గురించి మీ పిల్లలకు బోధించండి.

తదుపరి వ్యాసం