తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Quote: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఉన్నారా? అయితే మీ ప్రేమ చాలా గొప్పది..

Monday Quote: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఉన్నారా? అయితే మీ ప్రేమ చాలా గొప్పది..

13 June 2022, 6:30 IST

google News
    • అల్లంత దూరాల ఆ తారక.. కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా.. అరుదైనా చిన్నారిగా.. అని మీరు ఎప్పుడైనా మీ ప్రేయసి కోసం పాడుకున్నారా? ఇలాంటి అనుభూతి పొందేది కేవలం లాంగ్ డిస్టెన్స్ సంబంధంలో ఉన్నవారే.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్

Monday Quote : ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అందులోనూ ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ గురించి చెప్పుకోవాలి. చాలా మంది ఇలాంటి రిలేషన్ కష్టమని భావిస్తారు. ఇలా దూరంగా ఉండలేమని.. కలిసి ఉంటేనే ప్రేమని బ్రేకప్ చెప్పి విడిపోతారు. అలాంటివారు ఈ బంధానికి సరిపోరు. దేనికైనా సమఉజ్జీలు కావాలంటారు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కి కూడాఅంతే. మెచ్యూర్డ్ గా ఉండే ఇద్దరు.. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ని అర్థం చేసుకుంటారు. దానికి తోడుగా నిలుస్తారు. దూరంగా ఉంటూనే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు.

కొంచెం అటు ఇటుగా ఉండే వాళ్లు ఈ సంబంధంలో ఉంటే ఈజీగా ఛేంజ్ అయిపోతారు. వేరే వాళ్లకి త్వరగా ఎట్రాక్ట్ అయిపోతారు. అంతేకాకుండా త్వరగా ఇన్ ఫ్లూయెన్స్ అయిపోతారు. ఇతరులు చెప్పిన విషయాలు విని.. ఈజీగా అయినవారిని వదిలేసుకుంటారు. లేదా అనుమానంతో వేధిస్తూ ఉంటారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అనేది ఓ స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం.

ఒకరిని రోజూ కలుస్తూ.. కలిసి తిరుగుతూ.. ఉంటే తెలియకుండానే మనం ఓ బంధంలోకి వెళ్లిపోతాము. తీరా వెళ్లాక అది ఇష్టమో, ప్రేమో.. లేదా అలవాటో తెలుసుకోవడం చాలా కష్టం. ప్రేమ అయితే పర్లేదు కానీ అలవాటునే ప్రేమ అనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆ విషయాన్ని గుర్తించాకా.. ప్రేమ సాగదు సరి కదా.. బ్రేకప్ అయిపోతుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో అలా కాదు. మనం ఇష్టపడే వ్యక్తిని రోజూ మీట్ అవ్వకపోయినా.. వాళ్ల ఉనికి లేకపోయినా.. వాళ్లనే ప్రేమిస్తాము. వాళ్లకోసం ఎదురుచూడటం అనేది చాలా గొప్ప విషయం. అలా అని వీళ్ల మధ్య గొడవరాదని కాదు.. గొడవ కూడా వర్షంలాగా కురిసి.. ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ బంధంలో ఉన్నారని బాధపడకండి. మీ ప్రేమ స్వచ్ఛమైనదని గుర్తించండి.

టాపిక్

తదుపరి వ్యాసం