తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation | అనుకుంటే సరిపోదు.. అమలులో కూడా పెట్టాలి..

Monday Motivation | అనుకుంటే సరిపోదు.. అమలులో కూడా పెట్టాలి..

06 June 2022, 6:30 IST

google News
    • మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే సరిపోదు. దాని తగ్గ కృషి చేయాలి. మీరు రచయిత కావాలి అనుకుంటే సరిపోదు. దాని కోసం మీరు రాయడం ప్రారంభించాలి. అప్పుడే మీరు రచయిత అవ్వగలుగుతారు.
అనుకుంటే సరిపోదు.. ఆచరణలో పెట్టండి..
అనుకుంటే సరిపోదు.. ఆచరణలో పెట్టండి..

అనుకుంటే సరిపోదు.. ఆచరణలో పెట్టండి..

Monday Motivation | మీరు ఏదైనా సాధించాలనుకుంటే.. కేవలం ఆలోచించడమే కాదు.. దానికోసం ఏవిధంగా అడుగులు వేయాలో.. ఏవిధంగా కష్టపడాలో ఆలోచించాలి. దానికి తగిన కృషి చేయాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. పగటి కలలు కనడం తప్పేమి కాదు. కానీ వాటిని సాధించుకోవాలనే ఆశ మీలో ఉండాలి. కొన్ని పనులను ఆచరణలో పెడితేనే.. మనం కావాలనుకున్నది సాధించగలం. ముందు మీ జీవితంలో మీకు ఏమి కావాలో.. ఏది మంచిదో నిర్ణయించండి.

గొప్ప రచయిత కావడానికి.. గొప్పగా ఆలోచిస్తే సరిపోదు. గొప్పగా రాయడం ప్రారంభించాలి. దానికి గొప్పగా ముగింపు ఇవ్వాలి. కథను గొప్పగా మలచాలి. అప్పుడే మీరు మంచి రచయిత అవ్వగలరు. చెడ్డ రచయిత కావాలని ఎవరూ కోరుకోరు కాబట్టి.. మిమ్మల్ని మంచి రచయితగా ప్రేరేపించే అంశాలను మరచిపోకండి. మీకు నచ్చిన కథను అనేక మార్గాలలో రాయండి. ఇలా చేయడం ద్వారా దానిలోని లోపాలు, లోటుపాట్లు కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరు దానిని మరింత అందంగా.. మెరుగైన సరళితో కథను మరల్చవచ్చు.

మరికొందరు తర్వాత చేద్దాంలే.. తర్వాత రాద్దాములే అనుకుంటూ.. ఆ పనిని వాయిదా వేస్తారు. ఇప్పుడేం రాస్తాములే.. మంచి మూడ్ చూసుకుని రాసేద్దాం అనుకుని.. ఆ సమయాన్ని దాటేస్తారు. తర్వాత వేరే పనుల్లో నిమగ్నమై.. అసలు కథను గాలికి వదిలేస్తారు. మీకు ఎప్పుడైనా, ఏదైనా ఆలోచన వస్తే.. వెంటనే దానిని అమలులో పెట్టేందుకు ప్రయత్నించండి. అనంతరం దానిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించండి. మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో.. రోజులో ఏదొక టైం ఆలోచించండి. దానికోసం ఈ రోజు మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి. రేపు ఏమి చేస్తే.. ఫలితం ఇంకా బాగుంటుందో.. ప్రణాళికను సిద్ధం చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం