Monday Quote : కష్టాలు వస్తాయని తెలిసినా.. మీకు హెల్ప్ చేస్తున్నారంటే దానర్థం..
15 August 2022, 7:05 IST
- Monday Quote : మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. వాటి నుంచి బయటపడటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పుడు ఓ వ్యక్తి మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఫుల్‌గా ట్రై చేస్తున్నారు. చివరికి వారు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదంతా వారు మీకోసం చేస్తున్నారంటే అది కచ్చితంగా సహాయం కాదు. అది ప్రేమే.
కోట్ ఆఫ్ ద డే
Monday Motivation : స్వార్థపూరితమైన వ్యక్తులతో నిండిన నేటి ప్రపంచంలో.. మనకు హెల్ప్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఒక్కోసారి మనమే వారి సహాయన్ని కోరినా.. వారు మీకోసం ఆ పని చేస్తారనేది ప్రశ్నార్థకమే. ఇలాంటి సమయంలో ఒకరు మీ జీవితంలోకి వచ్చి.. మీ కష్టాలనుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే అది కచ్చితంగా సహాయమే అనుకోవచ్చు. కానీ మీకు సహాయం చేసేటప్పుడు వారు కష్టాలు ఎదుర్కొంటారని తెలిసినా.. ధైర్యంగా అడుగు ముందుకు వేసి.. మీతో సమానంగా వారు కూడా ఆ కష్టాలు భరిస్తున్నారంటే అది కచ్చితంగా ప్రేమే.
ఎందుకంటే సహాయం చేయడానికి వచ్చే వారు.. మీకు హెల్ప్ చేస్తారు. కానీ మీవల్ల వారిని కష్టాలు చుట్టు ముడుతున్నప్పడు కొంచెం జంకుతారు. మనకెందుకులే. ట్రై అయితే చేశాము. మనవల్ల కాలేదు. ఇంకేమి చేస్తామనుకుంటూ వెళ్లిపోతారు. కానీ మీకోసం కష్టాలను సైతం లెక్కచేయని వాళ్లు ఎక్కడ దొరుకుతారు చెప్పండి. ఈరోజుల్లో అలాంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం. మీ జీవితంలో అలాంటి వ్యక్తులను కలిగి ఉన్నట్లయితే మీరు నిజంగా అదృష్టవంతులే. మీరు వారిని మీ జీవితం నుంచి ఏ విధంగానూ వెళ్లనివ్వకుండా చూసుకోండి.
మీరు ఇప్పుడు వారి ప్రాముఖ్యతను గుర్తించలేకపోవచ్చు కానీ.. వారు మీకు ఓ నిధి లాంటివారు. ఒకవేళ వారు మీ జీవితం నుంచి వెళ్లిపోయినప్పుడే ఆ విషయం మీకు అర్థమవుతుంది. కొంతమంది అదృష్టవంతులు మాత్రమే వారి జీవితంలో అలాంటి వ్యక్తులను కలిగి ఉంటారు. ఓ వ్యక్తి కళ్లముందు నాశనమైపోతున్నా.. సహాయం చేయకలిగే స్థితిలో ఉన్నా.. చూస్తూ కాలం వెళ్లదీసే నీచమైన వ్యక్తులు నిండిన ఈ ప్రపంచంలో.. మీకోసం అన్నింటి భరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని మీరు చూడలేరు.
అయితే మీకు సహాయం చేసేవారు లేదా సహాయం చేస్తున్నట్లు నటించేవారు కూడా మీతో ఉండవచ్చు. ఆ విషయంలో మీరు కచ్చితంగా క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే సహాయం చేస్తున్నామనే ముసుగులో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేవారు కూడా మీ లైఫ్‌లోకి రావొచ్చు. అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చే వారు నిజంగా మీకు సహాయం చేస్తున్నారా? లేదా వారి స్వార్థం కోసం మీకు సహాయం చేస్తున్నారా అనే విషయంపై మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. లేకుంటే మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లే అవుతుంది.
కొందరు మంచి హృదయంతో ఏమి ఆశించకుండా మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఎవరో ఒకరు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అయితే మీకు సహాయం చేసే మంచి హృదయం ఉన్న వ్యక్తులను మీరు ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ విషయం మీకు కచ్చితంగా తెలుస్తుంది కాబట్టి.. వారిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకండి. ఎందుకంటే వారు స్వార్థం కోసం మీ దగ్గరకు రాలేదు. పైగా వారు మీకు ఎటువంటి హానీ చేయరు.
టాపిక్