తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Quote : ఒక్కోసారి మాట్లాడకపోతేనే తప్పు.. కాబట్టి గట్టి రిప్లై ఇవ్వండి..

Monday Quote : ఒక్కోసారి మాట్లాడకపోతేనే తప్పు.. కాబట్టి గట్టి రిప్లై ఇవ్వండి..

08 August 2022, 6:00 IST

    • చాలాసార్లు మన గొంతు మూగబోతుంది. మాట్లాడాలని లేక కాదు. మనం మట్లాడినా ఎదుటివారికి అర్థం కాదు అనుకున్నప్పుడు లేదంటే మనం మాట్లాడటం మొదలుపెడితే.. ఎదుటివాళ్లు ఇబ్బంది పడతారేమో అని మనం ఫీల్​ అయినప్పుడు మీ నోటి నుంచి ఒక్కమాట కూడా రాదు. కానీ ఇతరుల కోసం ఆలోచించే బదులు.. మీ కోసం మీరు మాట్లాడటం నేర్చుకోండి. అది మీకు మంచే చేస్తుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : ఒక్కోసారి మనం ఎంత ఫూలిష్​గా బిహేవ్ చేస్తామంటే.. ఎదుటివారి సౌలభ్యం కోసం లేదా ఎదుటివారు ఫీల్ అవుతారని.. మనం మాట్లాడము. ప్రతి ఒక్కరు ఇలాంటి సందర్భాలు ఎదుర్కొనే ఉంటారు. కొన్నిసార్లు గొడవను నియంత్రించడానికి మాట్లాడకుండా ఉండడమే మంచిది. కానీ కొన్నిసార్లు మీకు మీరు స్టాండ్ తీసుకుని మాట్లాడాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం గురించి మనం మాట్లడకపోతే ఇంకెవరు మీ గురించి స్టాండ్ తీసుకుంటారు చెప్పండి.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వారికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. వారితో సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉన్నా పర్లేదు. కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్న సమయంలో మీరు కచ్చితంగా మాట్లాడాలి. మీకు మీరు స్టాండ్ తీసుకోవాలి. లేదంటే ఆరోజు నేను మాట్లాడలేదే.. వారికి సరైనా సమాధానం ఇవ్వలేదే అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

మీకోసం మీరు నిలబడుతున్నారు.. మీ గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీరు స్వార్థపరులని అర్థం కాదు. నీ మౌనాన్నే ఇతరులు నీ ఓటమిగా తీసుకుంటున్నప్పుడు మాట్లాడాల్సిందే. మీ ఎదురుగా ఉన్నవారు చిన్న అయినా పెద్ద అయినా.. మిమ్మల్ని, మీ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మీరు మౌనంగా ఉంటే కచ్చితంగా మీ తప్పుని అంగీకరిస్తున్నట్లే. కాబట్టి మీరు మాట్లాడండి. ఎదుటివారు ఫీల్ అవుతారని మీరు బాధపడితే ఎప్పటికీ మాట్లాడలేరు. వారు ఫీల్ అవుతారేమో అని మీరు బాధపడటం తప్పా.. వారికి అలాంటివి ఏమి ఉండవు. అలాంటి ఎథిక్స్ వారికే ఉంటే.. ఇలా మిమ్మల్ని కించపరచరు.

మీరు ఇంతకాలం మౌనంగా ఉంది మీకు మాట్లాడటం రాకపోవడం వల్ల కాదు.. చేతకాక కాదు.. మాట్లాడితే మీ దగ్గర దానికి తగ్గజవాబు ఉండదని మాట్లాడలేదని తెలియజేయాలి. ఒకవేళ మాట్లాడినా.. అర్థం చేసుకునేంత బుద్ధి వారికి లేదని మీరు మౌనంగా ఉన్నట్లు తెలపాలి. మీరు మాట్లడటం స్టార్ట్ చేసినప్పుడు ఇతరుల తప్పులు వారికి అర్థమయ్యేలా చెప్పడం అస్సలు మరచిపోకండి. ఎందుకంటే మీరు అహంతో మాట్లాడుతున్నట్లు కాదు.. ఆ బంధాన్ని కాపాడుకునేందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు వారికి కచ్చితంగా తెలిసేలా చేయాలి. మీరు వాళ్లకి వాల్యు ఇచ్చి ఇన్నాళ్లు.. మౌనంగా, కంపోజ్డ్​గా ఉన్నట్లు వారికి తెలియజేయండి. మీ మౌనం ప్రత్యర్థిని మరింత బలపరుస్తుంది.

మనం సంబంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాము కాబట్టి మౌనంగా ఉంటాము. అయితే ఎంతకాలం ఇలానే ఉండిపోతాము? ఇతరులకు మీరు ఇచ్చే గౌరవం.. మిమ్మల్ని దుఖఃంలోకి.. కష్టాల్లోకి నెట్టేస్తుంది అనిపించినప్పుడు మీరు మాట్లాడాలి. సహించటానికి చాలా ఓపిక అవసరం. మనకి అది ఉండడం మంచిదే కానీ.. ఇతరులు మీపై అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. మీరు సంకోచించకండి. తెలివిగా వ్యవహరిస్తూ.. వారిని మ్యూట్ చేయండి.

టాపిక్