తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ఓ బంధంలో రోజూ చావడం కన్నా.. ఒకేసారి వదిలించుకుంటే బెటర్

Monday Motivation : ఓ బంధంలో రోజూ చావడం కన్నా.. ఒకేసారి వదిలించుకుంటే బెటర్

01 August 2022, 9:18 IST

google News
    • Monday Motivation : ఏ మనిషైనా తన జీవితం భాగస్వామితో మంచిగా ఉంటుందనే ఆలోచనతో ఆ బంధంలోకి అడుగు పెడతారు. కానీ ఒక్కసారి ఆ బంధంలోకి అడుగుపెట్టాక అది నిప్పులపై నడక అని తెలిసినప్పుడు దానిని వదిలించుకోవడమే బెటర్. విడిపోయినందుకు ఈరోజు బాధపడొచ్చు. కానీ వాళ్లతోనే ఉంటూ రోజూ ఏడ్వడం కన్నా.. ఇదే బెటర్.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : ప్రేమ, పెళ్లి, ప్రేమించి చేసుకున్నా.. పెద్దలు చూసి చేసినా.. ఏ బంధమైనా మంచిగా ఉంటుందనే ఆశతోనే ప్రారంభమవుతుంది. కానీ దాని తర్వాతే అసలు కథ మొదలువుతుంది. మీ బంధం హ్యాపీగా ఉంటే పర్లేదు కానీ.. ఆ బంధం రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇబ్బంది అంటే ఫిజికల్​గానే కాదు మెంటల్​గా కూడా ఇబ్బందికి గురిచేస్తే.. మీరు కచ్చితంగా ఆలోచించాల్సిందే.

ఒకటి ఇబ్బంది అంటే వారికి తెలియకుండా ఈ సమస్య రావొచ్చు. లేదా కావాలనే వారు మీతో అలా చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా జరిగే వాటిని మనం అర్థమయ్యేలా చెప్పి మార్చుకోవచ్చు. కానీ వారి ధోరణే అంత అని తెలిస్తే కచ్చితంగా మీరు ఆ బంధానికి ముగింపు పలకాల్సిందే. ముందు మీరు వారికి మీ సమస్యను చెప్పండి. ఆ తర్వాత వారిలో మార్పులేదని భావిస్తే మీరు ఆ బంధానికి శుభం కార్డు వేయడంలో తప్పులేదు.

ఓ బంధం నుంచి విడిపోవడం అంత తేలిక కాదు. దానికోసం మీ తల్లిదండ్రులు, సొసైటీకి మీరు ఎన్నో జవాబులు చెప్పాలి. ఫ్రూఫ్స్ చూపించాలి. అప్పటికీ మీ మాట వాళ్లు విని.. మిమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పలేము. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ బంధం నుంచి విడిపోవడం కాదు.. అడ్జెస్ట్​మవని చెప్తూనే ఉంటారు కాబట్టి. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. అతను లేదా ఆమె నుంచి బయటకు వచ్చి మీరు బతకగలరనే ధైర్యంలో మీలో కచ్చితంగా ఉండాలి. అప్పుడు ఎవరి అనుమతి ఉన్నా.. లేకున్నా మీరు ఆ బంధానికి స్వస్థి చెప్పవచ్చు.

ఇలా చేసినందుకు కొన్నిరోజులు బాధపడతారేమో.. కానీ లైఫ్​లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మీరు వారితో ఉంటూ రోజూ ఏడ్చి చావడం కన్నా.. ఒక్కసారే బయటకు వచ్చి.. ఆ సమస్యను అధిగమిస్తే చాలు. మీరు సంతోషంగా మీ లైఫ్​ని లీడ్ చేస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరో ఒకరు మీకు తోడుగా, అండగా నిలుస్తారు. ఎవరూ మీకు తోడున్నా, లేకున్నా.. మీ లైఫ్.. మీ నిర్ణయం కాబట్టి.. పదికి వేయిసార్లు ఆలోచించి.. మీ నిర్ణయాన్ని అమలు చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం