Mixed Fruit Smoothie Recipe : బరువు తగ్గడానికై మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ..
09 November 2022, 6:48 IST
- Mixed Fruit Smoothie Recipe : ఏంటి ఇంత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేయవచ్చా? అనిపించేలాంటి రెసిపీ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. పైగా దీనిని వండనవసరం లేదు. గంటలు గంటలు కిచెన్‌లో స్పెండ్ చేయనవసరం లేదు. పోషకాలు ఉండవేమో అనుకుంటున్నారా.. ఇది పూర్తి హెల్తీ రెసిపీ. అదే మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ.
మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ
Mixed Fruit Smoothie Recipe : ఉదయాన్నే పోషకాలతో కూడిన ఆహారం తినాలి అనుకుంటున్న వారికి ఓ ఆరోగ్యకరమైన రెసిపీ ఇక్కడ ఉంది. దానిని కోసం కిచెన్‌లో కష్టపడనవసరం లేదు. పైగా స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా దీనిని తయారు చేయవచ్చు. జిమ్, వ్యాయామం చేసి వచ్చిన వారికి అవసరమైన పోషకాలు దీనిలో ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ స్మూతీ తమ డైలీ రోటీన్లో భాగం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ స్మూతీని ఆరోగ్యం కోసం తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. మరి ఈ ఆరోగ్యకరమైన స్మూతీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* దానిమ్మ - పావు కప్పు
* అరటి - అరకప్పు
* నీరు - 1 కప్పు
* ఆపిల్ - 1 కప్పు
* పుచ్చకాయ - 1 కప్పు
* గుమ్మడి గింజలు - స్పూన్
* చియా సీడ్స్ - 2 స్పూన్స్ (నానబెట్టినవి)
తయారీ విధానం
మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకోవాలి. దానిలో అరటి, ఆపిల్, పుచ్చకాయ, నీళ్లు వేసి బ్లెండ్ చేయాలి. అది స్మూతీలాగా వచ్చే వరకు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఓ గిన్నే లేదా గ్లాస్ తీసుకుని.. దానిలో చియా సీడ్స్, గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు కొన్ని వేయాలి. దానిపై స్మూతీ వేయాలి. సగం వేశాక మళ్లీ చియా, గుమ్మడి సీడ్స్ వేసి దానిమ్మ వేయాలి. ఇలా లేయర్స్‌గా గార్నిష్ చేస్తే సరి. ఇది రుచికరమైనది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.