Millet Balls Recipe: మిల్లెట్ బాల్స్.. హెల్తీ ఇంకా టేస్టీ కూడా
24 August 2023, 14:37 IST
- Millet Balls: మిల్లెట్ బాల్స్ రెసిపీ గురించి విన్నారా? వర్షాకాలంలో ఎక్కువగా బయటకు వెళ్లలేము. ఇంట్లో ఉంటే మనసు ఏమైనా వేడిగా, టేస్టీగా, క్రంచీగా తినాలని కోరుకుంటుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తే వేడివేడిగా మిల్లెట్ బాల్స్ చేసేసుకోండి. ఈ హెల్తీ స్నాక్ ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చుద్దాం.
మిల్లెట్ బాల్స్: ఆరోగ్యకరమైన స్నాక్స్, రుచికరం కూడా (Pushpendra Payal, CC BY-SA 4.0 , via Wikimedia Commons)
మిల్లెట్ బాల్స్: ఆరోగ్యకరమైన స్నాక్స్, రుచికరం కూడా
మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది అవి అంత టేస్టీగా ఉండవని తినరు. ఈ వర్షాకాలంలో మిల్లెట్స్ ఉపయోగించి.. ఆరోగ్యకరమైన, టేస్టీ, క్రంచీ డిష్ తయారు చేసేయండి. తక్కువ కేలరీలతో ఎక్కువగా టేస్టీగా ఉండే మిల్లెట్ బాల్స్ ఎలా తయారు చేయాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ బాల్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
- జొన్నలు - 1 కప్పు (రాత్రంతా నానబెట్టి ఉడికించాలి)
- చనా - 1 ½ కప్పు (రాత్రంతా నానబెట్టి ఉడికించాలి)
- ఉల్లిపాయ - ½ కప్పు (తరిగినవి)
- వెల్లుల్లి - 2 రెబ్బలు
- కొత్తిమీర - ½ కప్పు
- జీలకర్ర - 1 స్పూన్
- ధనియా పొడి - ½ స్పూన్
- పెప్పర్ - ¼ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
- శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - ఫ్రై చేయడానికి తగినంత
మిల్లెట్ బాల్స్ తయారీ విధానం
- ఉడికించిన జొన్నలు, చనాను మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో తరిగి ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పెప్పర్ వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు దానిలో ఆలివ్ ఆయిల్ వేసి.. అనంతరం శనగ పిండి వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ముద్దలుగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ వలె ఒత్తి పక్కన పెట్టుకోవాలి.
- వాటిని వేడి వేడి నూనెలో వేసి.. మంట తగ్గించి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని టమెటా కెచప్ లేదా మంచి స్పైసీ చట్నీతో కలిపి తినొచ్చు. మీరు కూడా మిల్లెట్ బాల్స్ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు స్కూలుకు వెళ్లి వచ్చాక ఆకలి మీద ఉంటారు. ఈ ఆరోగ్యకరమైన మిల్లెట్ బాల్స్ తినిపించండి.