Washing dishes Tips: గిన్నెలు తోమేందుకు ఇంట్లోనే ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ తయారు చేయండి, గిన్నెలు మెరుస్తాయ్
19 December 2024, 16:37 IST
Washing dishes Tips: గిన్నెలు తోమే సబ్బులు, ద్రవాల్లో రసాయనాలు అధికంగా ఉంటాయి. వాటిని వాడడం వల్ల చేతుల చర్మం పాడవుతుంది. ఇంట్లోనే నేచురల్ వస్తువులతో లిక్విడ్ డిష్ వాష్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
డిష్ వాషింగ్ లిక్విడ్ తయారీ
గిన్నెలు తోమేందుకు మార్కెట్లో అనేక రకాల సబ్బులు, డిష్ వాషింగ్ ద్రవాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆ సబ్బులు, ద్రవాల్లో అనేక రకాల రసాయనాలు వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం, అంతేకాదు చేతుల చర్మం కూడా దీర్ఘకాలంలో పాడవుతుంది. అలాగే వీటితో పాత్రలు తోమడం వల్ల గిన్నెలపై అందులోని రసాయనాలు అతుక్కుని ఉండిపోతాయి. సరిగా కడగకుండా ఆ గిన్నెలను వాడితే ఆరోగ్యానికి ఎంతో డేంజర్.
ఆరోగ్యం, చర్మం రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇంట్లోనే గిన్నెలు తోమే లిక్విడ్ తయారుచేయవచ్చు. ఇది పాత్రలు సులభంగా మెరిసేలా చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని తయారు చేయడానికి పెద్దగా డబ్బు ఖర్చు అవ్వదు. కాబట్టి కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇంట్లోనే లిక్విడ్ డిష్ వాషర్ తయారీ
పాత్రలు కడగడానికి డిష్ వాషింగ్ లిక్విడ్‌ను తయారు చేసేందుకు నిమ్మరసం, రాక్ సాల్ట్, వైట్ వెనిగర్ కావాలి. ఈ మూడింటితో గిన్నెలో తోమేందుకు ప్రత్యేకమైన లిక్విడ్ చాలా సులువుగా చేసుకోవాలి. అర కిలో నిమ్మకాయలను తీసుకోవాలి.
- ఒక్కో నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి రెండు గ్లాసుల నీటిని వేసి మరిగించాలి.
- అందులో నిమ్మకాయ ముక్కలను వేసి ఉడికించాలి. ఆ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
- నిమ్మకాయ నీరు నురుగులా అయ్యే వరకు ఉంచి, రాక్ సాల్ట్, వైట్ వెనిగర్ కూడా వేసి అయిదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు దీన్ని వడకట్టి ఆ మిశ్రమాన్ని ఒక డబ్బాలో వేసుకోవాలి.
- అంతే గిన్నెలు తోమే డిష్ వాషర్ లిక్విడ్ రెడీ అయిపోయింది. దీనితో గిన్నెలు తోమితే త్వరగా మురికి వదిలేస్తుంది. మీ చేతులు కూడా పాడవ్వవు. ఎలాంటి చర్మ సమస్యలు కూడా రావు.
జిగటగా, మాడిపోయిన పాత్రలన్నింటినీ దీనితో శుభ్రపరచడం సులభం.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్